కోడింగ్ లో నలుగురు భారత విద్యార్థుల సత్తా

కోడింగ్ లో నలుగురు భారత విద్యార్థుల సత్తా

కోడింగ్ స్కిల్స్లో అంతర్జాతీయ వేదికలపైనా  భారతీయ విద్యార్థులు భళా అనిపిస్తున్నారు. ప్రఖ్యాత టెక్ దిగ్గజం యాపిల్ అందించే ‘2022 స్విఫ్ట్ స్టూడెంట్ చాలెంజ్’ అవార్డుకు మన దేశానికి చెందిన నలుగురు స్టూడెంట్స్ ఎంపికయ్యారు. పంజాబ్ లోని పటియాలాకు చెందిన జస్ కరణ్ సింగ్, మహారాష్ట్రలోని పుణెకు చెందిన జయ్ ఫిర్కే, గీతాంశ్ ఆత్రే, సుయాశ్ లనావత్  తమ కోడింగ్ స్కిల్స్ తో  స్విఫ్ట్ స్టూడెంట్ చాలెంజ్ లో ప్రతిభను కనబరిచారు. జస్ కరణ్ సింగ్ పటియాలాలోని థాపర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అతడు ఒక సరికొత్త యాప్ ను తయారు చేశాడు. మనం దాన్ని డౌన్ లోడ్ చేసుకొని చిన్నపాటి ఎక్సర్సైజ్ లు చేస్తే.. శరీరంలో రక్త ప్రసరణ జరుగుతున్న తీరుతెన్నులు తెలిసిపోతాయి. గీతాంశ్ ఆత్రే ‘వాల్ట్’ అనే ఒక యాప్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు. అది టైమ్ బేస్డ్ ఓటీపీలను జనరేట్ చేస్తుంది. జయ్ ఫిర్కే మహారాష్ట్రలోని పింప్రిలో ఉన్న చించ్వాడ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ రిసెర్చ్ లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఈ ఏడాది జూన్ 6 నుంచి 10 వరకు అమెరికాలోని కాలిఫోర్నియాలో జరగనున్న ‘వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్’లో భాగంగా స్విఫ్ట్ స్టూడెంట్ చాలెంజ్ ను నిర్వహించారు. దీనికి 40 దేశాలకు చెందిన మొత్తం 350 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. అన్ని దేశాలకు చెందిన టెక్ విద్యార్థులు కోడింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించే వేదికగా నిలుస్తున్న ‘స్విఫ్ట్ స్టూడెంట్ చాలెంజ్’ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తున్నారు. 

మరిన్ని వార్తలు..

F3 'ఫన్'టాస్టిక్..రూ.100 కోట్ల సెలబ్రేషన్స్‌

వీరి కొట్లాటలోకి కొత్తగా మరొకరు