
కర్ణాటక కొడగులో ఘోర ప్రమాదం జరిగింది. చిక్కోడి తాలూకాలో మట్టి బ్రిడ్జి కూలి నలుగురు చనిపోయారు. భారీ వర్షాలతో ఓ వాగుపై బ్రిడ్జి కోతకు గురైంది. బైకుపై బ్రిడ్జి మీద నుంచి వెళ్లేందుకు నలుగురు యువకులు ప్రయత్నించారు. యువకులు బ్రిడ్జిపై చేరుకోగానే.. ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయింది. దాంతో వరద ఉధృతికి నులుగురు యవకులు గల్లంతయ్యారు. రెస్క్యూ సిబ్బంది సెర్చింగ్ నిర్వహించి యువకుల మృతదేహాల్ని వెలికి తీసింది.