
తూప్రాన్, వెలుగు: మెదక్ జిల్లా తూప్రాన్ లో ఓ కుటుంబం కనిపించకుండా పోయింది. ఇందులో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్ఐ శివానందం కథనం ప్రకారం.. తూప్రాన్ కు చెందిన బిజిలిపురం యాదగిరి తన భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలతో కలిసి సోమవారం పెద్దగుట్టకు వెళ్తున్నామని చెప్పి వెళ్లాడు. అయితే, మంగళవారం సాయంత్రం వరకు తిరిగిరాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. కుటుంబ సభ్యులు పెద్దగుట్టకు వెళ్లి వెతికినా ఆచూకీ దొరకలేదు. యాదగిరి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.