
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లో రష్యాకు చెందిన ప్రైవేట్ జెట్ ఆదివారం ఉదయం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. మృతుల్లో నలుగురు సిబ్బంది, ఇద్దరు ప్యాసింజర్లు ఉన్నారు. బదాక్షన్ ప్రావిన్స్ జెబక్ జిల్లాకు దగ్గర్లోని తోప్‌ఖానా పర్వతాల్లో ఫ్లైట్ క్రాష్ అయినట్టు అఫ్గానిస్తాన్ ఏవియేషన్ అధికారులు ప్రకటించారు. అయితే, ఈ జెట్ ఇండియాది అంటూ ముందుగా అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ).. అఫ్గానిస్తాన్‌లో కూలింది ప్రైవేట్ జెట్ అని, అది ఇండియాది కాదని.. రష్యాదని స్పష్టం చేసింది. జెట్‌లో ఉన్న ఆరుగురూ చనిపోయినట్టు డీజీసీఏ వెల్లడించింది.