కాశ్మీర్​లో నలుగురు టెర్రరిస్టుల కాల్చివేత

కాశ్మీర్​లో నలుగురు టెర్రరిస్టుల కాల్చివేత

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్​లోని కుప్వారాలో పాకిస్తాన్ టెర్రరిస్టుల చొరబాటు యత్నాన్ని మన సైన్యం తిప్పికొట్టింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్​(పీవోకే)లోని కుప్వారా నుంచి మన దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన నలుగురు టెర్రరిస్టులను జమ్మూకాశ్మీర్ పోలీసులు, సైన్యం కాల్చి చంపేసింది. మచల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో పీవోకే నుంచి చొరబాటుకు యత్నిస్తున్న నలుగురు టెర్రరిస్టులు కాల్పుల్లో హతమైనట్లు జమ్మూకాశ్మీర్​ పోలీసులు శుక్రవారం మీడియాకు తెలిపారు. కాశ్మీర్ పోలీసులు, మన సైన్యం సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టిందని చెప్పారు.

కాగా, గురువారం తెల్లవారుజామున అనంత్​నాగ్ పోలీసులు కాశ్మీర్​లోని బిజ్ బేరా ప్రాంతంలో లష్కరే తాయిబా అనుబంధ సంస్థకు చెందిన ఇద్దరు టెర్రరిస్టులను ఆర్మీ మట్టుబెట్టింది. ఈ నెల 16న కూడా పాక్ టెర్రరిస్టుల పన్నాగాన్ని మన సైన్యం తిప్పికొట్టింది. కాశ్మీర్​ నియంత్రణ రేఖ దగ్గరలోని జుమాగుండ్​ ప్రాంతంలో ఐదుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టింది. జేకే గజ్నవి ఫోర్స్​కు చెందిన ఈ ఐదుగురు అత్యంత శిక్షణ పొందిన టెర్రరిస్టులు అని తెలిపింది.