అభివృద్ధి దారిలో కాశ్మీరం .. తగ్గిపోయిన టెర్రర్ యాక్టివిటీస్

అభివృద్ధి దారిలో కాశ్మీరం ..  తగ్గిపోయిన టెర్రర్ యాక్టివిటీస్

శ్రీనగర్:  ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుని నాలుగేండ్లు పూర్తయింది. జమ్మూకాశ్మీర్‌‌‌‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఈ ఆర్టికల్‌‌ను తొలగించి.. కొత్త శకానికి కేంద్రం నాంది పలికింది. ఈ నాలుగేండ్లలో జమ్మూకాశ్మీర్‌‌‌‌లో ఊహించని మార్పు జరిగింది. అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టెర్రర్ కార్యకలాపాలు తగ్గాయి. వ్యాపారాలు, విద్యకు ఎలాంటి అడ్డంకులు లేవు. స్ట్రైక్‌‌లు లేవు. అల్లర్లు లేవు.. రాళ్లు విసరడాలు లేవు.. హింస లేదు.. పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఇక టూరిస్టుల విషయంలో.. దేశంలో ఏ రీజియన్‌‌కూ రానంత మంది జమ్మూకాశ్మీర్‌‌‌‌కు వచ్చారు. అశాంతి పోయి.. శాంతి నెలకొంది. అలజడి పోయి.. సందడి మాత్రమే కనిపిస్తోంది. 

రాళ్ల దాడులు, పౌరుల మరణాలు లేవు..

గతంలో నిరసనలు, రాళ్లు విసిరిన ఘటనల్లో పోలీసులు, సెక్యూరిటీ దళాల చేతుల్లో పౌరులు చనిపోయే వారు. కానీ ఈ నాలుగేండ్లలో ఇలాంటి ఒక్క ఘటన కూడా జరగలేదు. టెర్రర్ యాక్టివిటీలు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 5 దాకా 35 మంది మిలిటెంట్లు సెక్యూరిటీ దళాల చేతిలో హతమయ్యారు. గతేడాది ఇదే పీరియడ్‌‌లో 120 మంది హతమయ్యారు.

ప్రజలు నచ్చినట్లు బతుకుతున్నరు

జమ్మూకాశ్మీర్‌‌‌‌లోని ప్రజలు తమకు నచ్చినట్లు బతుకుతున్నారని, ఆర్టికల్ 370 తర్వాత జరిగి న అతిపెద్ద మార్పు ఇదేనని లెఫ్టినెంట్ గవర్నర్‌‌‌‌ మనోజ్ సిన్హా అన్నారు. ‘‘పాక్‌‌ స్పాన్సర్డ్‌‌ టెర్రరిస్టు లు, వేర్పాటువాదుల షట్‌‌డౌన్స్ వల్ల.. స్కూళ్లు, కాలేజీలు, వ్యాపార సంస్థలు ఏడాదికి 150 రోజు లు మూతబడే ఉంటాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వీధి హింసకు తెరపడింది” అని చెప్పారు.

ఆర్టికల్ 370 రద్దుకు నాలుగేండ్లు

  • ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జిని చీనాబ్‌‌ నదిపై కడుతున్నారు.
  • ప్రపంచంలోనే పొడవైన సింగిల్ ట్యూబ్ హైవే టన్నెల్‌‌ను నిర్మించారు. 
  • శ్రీనగర్–జమ్మూ హైవేని అప్‌‌గ్రేడ్ చేశారు. దీంతో ప్రయాణ సమయం సగానికి తగ్గింది. 
  • 32 మెగా ఇన్‌‌ఫ్రా ప్రాజెక్టుల్లో పూర్తయ్యాయి.
  • టూరిజం ఊహించని రీతిలో పుంజుకుంది. గతేడాది ఏకంగా 1.88 కోట్ల మంది, గడిచిన 7 నెలల్లో 1.27 కోట్ల మంది పర్యటించారు.
  • ముప్పై ఏండ్ల తర్వాత సినిమా హాల్ ఓపెన్.
  • రెండు ఎయిమ్స్‌‌ మంజూరయ్యాయి.
  • దాదాపు 75 ఏండ్ల తర్వాత శారద టెంపుల్‌‌లో దీపావళి వేడుకలు జరిగాయి.
  • 34 ఏండ్ల తర్వాత శ్రీనగర్‌‌‌‌ వీధుల్లో మొహర్రం ఊరేగింపు నిర్వహించారు.
  • జీ20 సమ్మిట్‌‌ టూరిజం మీట్‌‌ను 
  • శ్రీనగర్‌‌‌‌లో నిర్వహించారు.