వచ్చే సంవత్సరం నుంచి నాలుగేండ్ల డిగ్రీ

వచ్చే సంవత్సరం నుంచి నాలుగేండ్ల డిగ్రీ

విదేశీ విద్య కోసం ఈ నాలుగేండ్ల డిగ్రీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి నాలుగేండ్ల డిగ్రీ కోర్సులు ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. వీటిని ఏఏ కోర్సుల్లో అమలుచేయాలనే దానిపై కసరత్తు కొనసాగిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న మూడేండ్ల డిగ్రీ కోర్సులు పూర్తిచేస్తే విదేశాల్లో చదివేందుకు అవకాశంలేదు. ఇంటర్​తర్వాత తప్పకుండా నాలుగేండ్ల కోర్సు చేయాలి. దీంతో మన రాష్ట్రంలో డిగ్రీ చేసిన విద్యార్థులు అదనంగా ఓ ఏడాది పాటు ఏదైనా వేరే కోర్సు చేస్తున్నారు. అలాంటి కష్టాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో నాలుగేండ్ల కోర్సు తీసుకురావాలని ఉన్నత విద్యామండలి భావించింది. 2020–21 విద్యాసంవత్సరంలో బీఎస్సీ డేటాసైన్స్, బీకాం బిజినెస్​ అనాలటిక్స్ కోర్సులు ప్రవేశపెట్టాలని ఇప్పటికే నిర్ణయించింది. సెలబస్ కూడా తయారవుతోంది. ఈ రెండు కోర్సుల్లో నాలుగేండ్ల డిగ్రీని ముందుగా ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ కోర్సుల్లో మూడేండ్లు చదివితే డిగ్రీ సర్టిఫికేట్, నాలుగేండ్లు చదివితే హానర్ డిగ్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు.

For More News..

రైల్వే శాఖ కొత్త రూల్.. ప్రయాణికులపై భారం

సమ్మె చేస్తే జాబ్ నుంచి తీసేయండి

తెలంగాణ నుంచి రాజ్యసభకు వారిద్దరేనా?

ఏపీ పంపిస్తామన్నా.. తెలంగాణ తీసుకెళ్లట్లేదు..

ఇయర్ ఫోన్స్ కొంటే.. కారు గెలిచారని ఫోన్

రేవంత్ పోరాటంతో కాంగ్రెస్‌కు సంబంధం లేదు