
సరస్వతీ పుష్కరాలు వైభవంగా సాగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం త్రివేణి సంగమానికి వస్తున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. త్రివేణి సంగమంలో పుష్కరస్నానం ఆచరించడానికి భక్తులు పోటెత్తారు. నాల్గవ రోజు ఆదివారం సెలవు రోజు కావడంతో .. భారీగా భక్తులు రావడంతో పుష్కరఘాట్ కిక్కిరిసిపోయింది. ఈ రోజు ( మే 18) తెల్లవారుజామునుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర.. ఛత్తీస్ ఘడ్ నుంచి భక్తులు భారీగా వస్తున్నారు.
దీంతో మహదేవపూర్, కాళేశ్వరం రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలను క్రమబద్దీకరించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలు బైక్ పై తిరుగుతూ వాహనాలను పంపించే పనిలో నిమగ్నం అయ్యారు. పెద్ద సంఖ్యలో వాహనాలు కాళేశ్వరం చేరుకుంటున్నాయి.
త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు, గోదావరి మాతకు ప్రత్యేక పూజలు...సైకత లింగాలను ఏర్పాటు చేసి పూజిస్తున్నారు భక్తులు.
అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి దర్శనం క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు.
కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలను పురస్కరించుకొని 108 ఎమర్జెన్సీ సర్వీసెస్ అంబులెన్స్ ని అత్యవసర సేవల కొరకు 5 అంబులెన్స్ లు ఉంచారు. ఎటువంటి అత్యవసర సేవల కొరకైన ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేయవచ్చని అధికారులు తెలిపారు.
- PHC Kaleshwaram ambulance no : 8712615698
- VIP Ghat ambulance no : 8712615687
- Godavari Ghat : 9063449664
- Main temple ambulance no : 9063449674
- Bus stand Ghat no : 8712615685
- ఇతర వివరాలకు అంబులెన్స్లకు సంబంధించి 108 District Manager: Naresh Cell no : 9154269788 వారిని సంప్రదించాలని అధికారులు తెలిపారు