రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగో విడుత చర్చలు

రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగో విడుత చర్చలు
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొనసాగిన నాలుగో దఫా చర్చలు

రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగో దఫా చర్చలు జరిగాయి. ఇప్పటికే మూడు సార్లు తటస్థ వేదికపై భౌతికంగా జరిగినా ఈ సారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండు దేశాల అధికారులు భేటీ అయ్యారు. ఇవాళ కొన్ని అంశాలపై చర్చించినా.. ఏకాభిప్రాయం రాకపోవడంతో రేపు మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. స్పష్టత వచ్చే వరకు రేపు కూడా చర్చలు కొనసాగించాలని ఇరుపక్షాల అధికారులు నిర్ణయించారు. చర్చల ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తామని ఉక్రెయిన్ ప్రతినిధి మైఖైలో పోడోల్యాక్ స్పష్టం చేయగా.. ఈ చర్చలు చాలా క్లిష్టమైనవని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అభిప్రాయపడ్డారు. 
మరోవైపు ఉక్రెయిన్ పై దాడికి ఆయుధాలు కావాలని రష్యా.. చైనాను అడిగిందన్న వార్తలు ఉద్రిక్తతను మరింత పెంచాయి. దీనిపై ఉక్రెయిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అయితే.. ఈ వార్తల్లో నిజం లేదని రష్యా, చైనా ప్రకటించాయి. దీనిపై అమెరికా అబద్దాలు ప్రచారం చేసిందని చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

 

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్