
న్యూఢిల్లీ: ఇండియా స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్.. ఎఫ్‌ఐజీ వరల్డ్ కప్‌లో నాలుగో ప్లేస్‌తో మెరిసింది. పారిస్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో భాగంగా దోహాలో శుక్రవారం జరిగిన విమెన్స్ పోల్ వాల్ట్ ఫైనల్లో దీప 13.333 పాయింట్లు సాధించి కొద్దిలో బ్రాంజ్ మెడల్ మిస్సయింది. నవాస్ కర్లా (పనామ, 13.850), అన్ చాంగ్ ఓక్ (కొరియా, 3.833), జార్జియోవా వాలెంటినా (వియత్నాం, 13.466) వరుసగా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ నెగ్గారు. క్వాలిఫయింగ్‌లో ఆరో ప్లేస్‌లో నిలిచిన దీప.. ప్రధాన పోటీలో మెరుగైన పెర్ఫామెన్స్ చూపెట్టింది. గత నెలలో అజర్‌బైజాన్‌లో జరిగిన బాక్ వరల్డ్ కప్‌లోనూ దీప నాలుగో ప్లేస్‌లోనే నిలవడం గమనార్హం. మే 16 నుంచి 19 వరకు ఉజ్బెకిస్తాన్‌లో చివరి ఒలింపిక్ క్వాలిఫయింగ్ఈవెంట్ అయిన ఆసియా చాంపియన్‌షిప్ జరగనుంది.