స్కంద నుంచి నాలుగో పాట రాబోతుంది

స్కంద నుంచి నాలుగో పాట రాబోతుంది

రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ ‘స్కంద’. జీ స్టూడియోస్‌‌‌‌‌‌‌‌తో కలిసి శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి మూడు పాటలను విడుదల చేసిన టీమ్, శనివారం నాలుగో పాటకు ముహూర్తం పెట్టింది. 

ALSO READ : బొజ్జ గణపయ్యకు నైవేద్యాలు.. ఎలా తయారుచేయాలంటే..

‘కల్డ్ మామా’ అంటూ సాగే పాటను ఈ నెల 18న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ పాటలో  రామ్‌‌‌‌‌‌‌‌తో బాలీవుడ్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌ ఊర్వశి రౌతేలా డ్యాన్స్ చేయనున్నట్టు పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. సినిమాలో ఇదొక స్పెషల్ సాంగ్‌‌‌‌‌‌‌‌గా షూట్ చేశారు మేకర్స్. మాస్ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తమన్ ఈ పాటను కంపోజ్ చేశాడు. 

శ్రీలీల, సయి మంజ్రేకర్ హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, గౌతమి, ప్రిన్స్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ నెల 28న పాన్ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌గా సినిమా విడుదల కానుంది.