
ఆన్‌లైన్ పార్ట్‌టైమ్ జాబ్ స్కామ్‌లో 39 ఏళ్ల సినీ ఆర్టిస్ట్ దాదాపు రూ.6 లక్షలు మోసపోయారు. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ సైబర్ నేరస్థుడిపై ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
టెలిగ్రామ్‌లో జాబ్ ఆఫర్ వచ్చింది
జోగేశ్వరికి చెందిన గణేశన్ నాడార్‌కు మే 26న అతని టెలిగ్రామ్ ఖాతాకు లాభదాయకమైన ఓ పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్ మెసేజ్ వచ్చింది. మోసగాడు బాధితుడికి అప్లికేషన్ లింక్‌ను పంపాడు. అది 'చాలా ఆసక్తికరంగా' అనిపించింది. అందుకే గణేశన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేశాడు.
సుమారు రూ.6 లక్షలకు పైగా మోసం
నిందితుడు నాడార్‌కు, సైబర్ నేరస్థుడు ఒక పనిని అప్పగించాడు. అసైన్‌మెంట్ పూర్తయిన తర్వాత అతని బ్యాంకు ఖాతాలో రూ.1,000 జమ చేశాడు. రెండోసారి రూ.11వేలు చెల్లించాలని కోరగా, అతడి ఖాతాలో రూ.18,283 జమ అయింది. మూడో సారి మోసగాడు, బాధితుడిని రూ.29,009 అడిగాడు. ఆ తరువాత రూ.37,965 లాభాన్ని నాడార్ ఖాతాలో జమ అయింది. తనను బాధితుడు పూర్తిగా నమ్మేశాడని నిశ్చయించుకున్న నిందితుడు.. నాడార్ ను రూ.5.97 లక్షలు బదిలీ చేయమని ఒప్పించాడు. ఆ తర్వాత సైబర్ నేరస్థుడు ఎలాంటి సమాచారం లేకుండా పోయాడు. దీంతో మోసపోయానని గ్రహించిన నాడార్.. పోలీసులను ఆశ్రయించారు.