దుమ్మురేపిన డిఫెండింగ్ ఛాంపియన్..అర్జెంటీనాతో అమీతుమీకి సిద్ధం

దుమ్మురేపిన డిఫెండింగ్ ఛాంపియన్..అర్జెంటీనాతో అమీతుమీకి సిద్ధం

ఫిఫా వరల్డ్ కప్ 2022 లో డిఫెండింగ్ ఛాంపియన్ దుమ్మురేపింది. వరుసగా రెండో సారి ఫైనల్ చేరింది. రెండో సెమీస్లో మొరాకో జట్టును చిత్తు చేసింది. ఏక పక్షంగా సాగిన మ్యాచ్లో 2–0 గోల్స్ తేడాతో గెలిచి అర్జెంటీనా అమీతుమీకి సిద్దమైంది. ఈ మ్యాచ్లో  మొరాకో ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. 

ఆది నుంచే ఆధిపత్యం..

మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచే ఫ్రాన్స్..మొరాకోపై స్పష్టమైన ఆధిపత్యం చలాయించింది. తొలి 5 నిమిషాల్లోనే ఫ్రాన్స్ తొలి గోల్ చేసింది. థియో హెర్నాండెజ్‌ అద్భుత రీతిలో గోల్‌ చేసి ఫ్రాన్స్‌ను 1–0తో ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత ఆ తర్వాత ఫస్టాఫ్ లో ఇరు జట్లు గోల్ చేసేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకుపోయింది. అయితే ఫ్రాన్స్ మాత్రం 1–0తో ఆధిక్యంలో కొనసాగింది. 

ఒక్క గోల్ కూడా చేయలె..

రెండో అర్థభాగంలోనూ ఫ్రాన్స్‌ దూకుడుగా ఆడింది. ఆ జట్టు ఆటగాళ్లు అనేక సార్లు మొరాకో గోల్ పోస్టుపై దాడులు చేశారు. ఇదే సమయంలో 79 నిమిషాల వద్ద ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబపే రాండల్ కోలో మువానీకు అద్భుతమైన పాస్ ఇచ్చాడు. దీన్ని ఉపయోగించుకున్న రాండల్‌ కోలో మువానీ గోల్‌ చేయడంతో ఫ్రాన్స్‌ 2–0తో నిలిచింది. అటు మొరాకో ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. 

అర్జెంటీనాతో అమీతుమీ...

ఫిఫా వరల్డ్ కప్లో భాగంగా  డిసెంబర్‌ 18న ఫైనల్ జరగనుంది. ఆదివారం జరిగే ఫైనల్లో ఫ్రాన్స్‌..అర్జెంటీనా తలపడనుంది. చివరి ఏడు ప్రపంచకప్లలో ఫ్రాన్స్‌ నాల్గో సారి ఫ్రాన్స్  ఫైనల్‌కు చేరుకుంది.