ఫిఫా వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ చేరిన ఫ్రాన్స్

ఫిఫా వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ చేరిన ఫ్రాన్స్
  • ఏడోసారి సెమీ ఫైనల్‌‌‌‌ చేరిన డిఫెండింగ్​ చాంప్
  • క్వార్టర్‌‌‌‌ ఫైనల్లో 2-1తో ఇంగ్లండ్‌‌‌‌పై విక్టరీ

అల్​ఖోర్​ (ఖతార్​): కీలక టైమ్​లో వచ్చిన చాన్స్​ల​ను సద్వినియోగం చేసుకున్న డిఫెండింగ్​ చాంపియన్​ ఫ్రాన్స్​.. ఫిఫా వరల్డ్​కప్​లో​ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్​ఫైనల్లో ఫ్రాన్స్​ 2–1తో ఇంగ్లండ్​పై గెలిచింది. ఫ్రాన్స్​ తరఫున అరెలియన్​ చౌమెన్​ (17వ ని.), ఒలివర్​ గిరౌడ్​ (78వ ని.) గోల్స్​ సాధించగా, హ్యారీ కేన్​ (54వ ని.) ఇంగ్లండ్​కు పెనాల్టీ గోల్​ను అందించాడు. తాజా విజయంతో బ్రెజిల్​ (1962) తర్వాత వరుసగా రెండో వరల్డ్​కప్​ రేస్​లో నిలిచిన తొలి జట్టుగా ఫ్రాన్స్ రికార్డుల కెక్కింది. మెగా టోర్నీలో ఫ్రాన్స్‌‌‌‌ సెమీస్‌‌‌‌ చేరడం ఇది ఏడోసారి కావడం విశేషం. మరోవైపు ఇంగ్లండ్‌‌‌‌ ఏడు సార్లు క్వార్టర్‌‌‌‌ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది.  బుధవారం జరిగే సెమీస్​లో ఫ్రాన్స్​.. మొరాకోతో తలపడుతుంది. 

కేన్​ను కట్టడి చేస్తూ..

ఆట ప్రారంభం నుంచి ఇరుజట్లు హోరాహోరీగా తలపడినప్పటికీ ఇంగ్లండ్​ ఎక్కువసేపు బాల్​ను కంట్రోల్​లో ఉంచుకుంది. కానీ గోల్స్​ చేసే అవకాశాలను సృష్టించుకోలేకపోయింది. అదే టైమ్​లో ఇంగ్లండ్​ గోల్​పోస్ట్​పైకి పదేపదే దాడులు చేసిన ఫ్రాన్స్17వ నిమిషంలోనే తొలి ఫలితాన్ని సాధించింది. లెఫ్ట్ ఫ్లాంక్​ నుంచి ఆంటోని గ్రిజ్​మన్​ ఇచ్చిన పాస్​ను అందుకున్న చౌమెన్​ 20 మీటర్ల దూరం నుంచి బలంగా ఇంగ్లండ్​ గోల్​పోస్ట్​లోకి పంపి ఫ్రాన్స్​ను 1–0 లీడ్​లో నిలిపాడు. ఇక్కడి నుంచి స్కోరును సమం చేసేందుకు ఇంగ్లండ్​ స్టార్​ ఫార్వర్డ్​ హ్యారీ కేన్​ ఎదురుదాడికి దిగాడు. కానీ ఫ్రాన్స్​ డిఫెన్స్​ అతన్ని పూర్తిగా కట్టడి చేసింది. అయితే సెకండాఫ్​లో హ్యారీ కేన్​.. పెనాల్టీ కిక్​ను గోల్​గా మలిచి స్కోరును 1–1తో ఈక్వల్​ చేశాడు.  ఇంగ్లిష్​ టీమ్​ తరఫున కేన్​కు ఇది 53వ గోల్​ కావడం విశేషం. నేషనల్​ టీమ్​ తరఫున అత్యధిక గోల్స్​ చేసిన వేన్​ రూనీతో సమంగా నిలిచాడు. ఇక్కడి నుంచి గోల్​ చేసే అవకాశాలు ఇంగ్లండ్​కే ఎక్కువగా వచ్చినా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరోవైపు 77వ నిమిషంలో ఇంగ్లండ్​ డిఫెండర్​ హ్యారీ మిగేర్​ను తప్పిస్తూ గిరౌడ్​ కొట్టిన సూపర్​ షాట్​ ఇంగ్లండ్​ కీపర్​ జోర్డాన్​ పిక్​ఫోర్డ్​ను దాటేసింది. దీంతో ఫ్రాన్స్​ 2–1లీడ్​లోకి వెళ్లింది. అయితే 84వ నిమిషంలో స్కోరును సమం చేసే చాన్స్​ను హ్యారీ కేన్​ మిస్​ చేశాడు. అతను కొట్టిన పెనాల్టీ కిక్‌‌‌‌కు బాల్‌‌‌‌ నెట్‌‌‌‌ పై నుంచి బయటకు వెళ్లింది. అంతే ఇంగ్లండ్​ ఫ్యాన్స్​తో పాటు ప్లేయర్లందరూ ఒక్కసారిగా డీలాపడిపోయారు. ఖతార్​లో క్వార్టర్స్​ చేరే క్రమంలో 12 గోల్స్​ చేసిన ఇంగ్లండ్​ ఈ వరల్డ్​కప్​లో తొలిసారి మ్యాచ్​లో వెనుకబడింది. ఫ్రాన్స్​ స్టార్​ ప్లేయర్​ ఎంబాపె గోల్​ కొట్టకపోయినా.. కేన్​ కిక్​ మిస్​ అయిన తర్వాత చాలా ఉద్వేగంగా స్పందించాడు. ఈ టోర్నీలో తను ఐదు గోల్స్​తో టాప్​ స్కోరర్​గా ఉన్నాడు.

సెమీస్​లో ఎవరితో ఎవరు

అర్జెంటీనా x  క్రొయేషియా - మంగళవారం రా. 12.30
ఫ్రాన్స్​ x మొరాకో  - బుధవారం రా. 12.30