మేలు జాతి ఆవుల పేరిట మోసం

మేలు జాతి ఆవుల పేరిట మోసం
  •     రైతును ముంచిన  సైబర్​ చీటర్​
  •     రూ.62 వేలు పోగొట్టుకున్న 
  •      పాలమూరు జిల్లా దరిపల్లి వాసి 

నవాబుపేట, వెలుగు :  మేలు జాతి ఆవులిస్తానని ఫొటోలు పంపించి ఆన్​లైన్​ద్వారా రూ.62 వేలు వసూలు చేశాడో సైబర్​మోసగాడు. ఎస్ఐ పురుషోత్తం కథనం ప్రకారం..మహబూబ్​నగర్​జిల్లా నవాబుపేట మండలం దరిపల్లి గ్రామానికి చెందిన రైతు రమేశ్​కు ఆగస్టు 13న ఉదయం ఓ వ్యక్తి కాల్​చేసి తన వద్ద మేలు జాతి ఆవులున్నాయని, తక్కువ ధరకు ఇస్తానని నమ్మించాడు.

ఆవుల ఫొటోలు పంపి సెలెక్ట్​ చేసుకోమని చెప్పాడు. రైతు వాటిలో రెండు ఆవులను సెలెక్ట్​ చేసుకున్నాడు. ఒక్కో ఆవు ధర రూ.45 వేలు అని తన నెంబర్​కు రూ. 90 వేలు ఫోన్​పే ద్వారా ట్రాన్స్​ఫర్​ చేయాలని కోరాడు. దీంతో రమేశ్​మరుసటి రోజు కొంత డబ్బును ఫోన్​పే ద్వారా పంపించాడు. అవతలి వ్యక్తి మరో నెంబర్, స్కానర్​పంపించి మిగిలిన డబ్బులు ట్రాన్స్​ఫర్​ చేస్తే వెంటనే ఆవులను ఇంటికి పంపిస్తామని చెప్పాడు.

దీంతో రమేశ్​రూ.62 వేలు ట్రాన్స్​ఫర్​ చేసి అవతలి వ్యక్తికి ఫోన్​ చేయడానికి ప్రయత్నంచగా స్విచ్​ఆఫ్​వచ్చింది. నెల రోజులుగా కాల్​చేస్తూనే ఉన్నా స్విచ్​ఆఫ్​చేసే ఉంది. దీంతో తాను మోసపోయానని గుర్తించి శుక్రవారం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.