
న్యూఢిల్లీ: వివాదాలకు దారితీసిన ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్ , 2017 (ఎఫ్ ఆర్ డీఐ బిల్ ) ను మళ్లీ ప్రవేశ పెట్టాలనే అంశంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎఫ్ ఆర్ డీఐ బిల్లును తిరిగి ప్రవేశ పెడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వివరణ ఇస్తున్నట్లు తెలిపింది. బిల్లును సమగ్రంగా పరిశీలిం చాలనే నిర్ణయంతో ఆగస్టు 2018 లో దానిని ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.
ఎఫ్ ఆర్ డీఐ బిల్లులోని బెయిల్ ఇన్ క్లాజ్ దేశంలోని బ్యాంకు డిపాజిటర్లను బెంబేలెత్తించింది. తమ డిపాజిట్లకు ఇక రక్షణే ఉండదనే ఆందోళనను వారిలో పెంచింది. ఈ నేపథ్యంలో ఎఫ్ ఆర్ డీఐ బిల్లును పార్లమెంట్ జాయిం ట్ కమిటీ పరిశీలనకు పంపించారు. ఈ బిల్లును మళ్లీ తెస్తున్నట్లు వస్తున్న వార్తలలో నిజం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తాజా ప్రకటన విడుదల చేసింది.