
Textile stocks: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ప్రకటించిన ట్రేడ్ టారిఫ్స్ నిలిపివేత గడువు రేపటితో ముగియనుంది. ఈ క్రమంలో ట్రంప్ కొత్తగా అనేక దేశాలకు అదనపు సుంకాలను ప్రకటిస్తూ లేఖలు పంపారు. ఈ క్రమంలో పొరుగున ఉన్న బంగ్లాదేశ్ పై 35 శాతం అదనపు సుంకాలను ప్రకటించటం ప్రస్తుతం భారతదేశానికి అనుకూలంగా మారుతోంది.
ప్రధానంగా అమెరికాకు టెక్స్ టైల్ సరఫరాలో వియత్నాం 19 శాతం వాటాను కలిగి ఉండగా.. రెండవ స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ 9 శాతం వ్యాపార వాటాను కలిగి ఉంది. భారత్ మూడో స్థానంలో 6 శాతం వ్యాపారాన్ని కొనసాగిస్తుండగా.. ట్రంప్ ప్రస్తుతం బంగ్లా పై 25 శాతం సుంకాలు ఉత్పత్తులను ఖరీదుగా మార్చేస్తాయి. దీంతో భారత్ లోని పరిశ్రమలకు వర్క్ ఆర్డర్లు పెరగవచ్చని తెలుస్తోంది.
ట్రంప్ నిర్ణయం తర్వాత ఇండియన్ టెక్స్ టైల్ స్టాక్స్ 8 శాతం వరకు పెరుగుదలను చూశాయి. గోకల్ దాస్ ఎక్స్‌పోర్ట్స్, కేపీఆర్ మిల్, వర్థమాన్ టెక్స్ టైల్స్, వెల్ స్పన్ లివింగ్ వంటి కంపెనీల షేర్లు పెరుగుదలను నమోదు చేశాయి. దీనికి తోడు అమెరికాకు ఉత్పత్తులను ఎగుమతి చేసే అనేక సంస్థల షేర్లు కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. ట్రంప్ కొత్త రేట్లు ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్న క్రమంలో ఈలోపు బంగ్లాదేశ్ ప్రతినిధులు తగ్గింపుకు చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదే క్రమంలో ఇండియాతో డీల్ చేసుకునేందుకు తాము చాలా దగ్గరలోనే ఉన్నట్లు అమెరికా వెల్లడించింది. ఇప్పటికే యూకే, చైనా, వియత్నాం దేశాలతో ట్రంప్ ట్రేడ్ డీల్స్ పూర్తయ్యాయని చెప్పారు. అయితే తాజాగా ట్రంప్ జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, ఖజకిస్థాన్, ట్యునీషియాలపై 25 శాతం సుంకాలను ప్రకటించారు. దక్షిణ ఆఫ్రికా- బోస్నియా- హెర్జిగోవినాపై 30 శాతం, ఇండోనేషియాపై 32 శాతం, బంగ్లాదేష్ -సెర్పియాలపై 35 శాతం , థాయిలాండ్- కంబోయిడాలపై 36 శాతం టారిఫ్స్ ప్రకటిస్తూ లేఖలు పంపారు.