
హైదరాబాద్, వెలుగు: ఈ దీపావళి పండుగను పురస్కరించుకుని, ఫ్రెడెరిక్ కాన్స్టంట్ కంపెనీ టైమ్‌లెస్ ఫెస్టివ్ గిఫ్టింగ్ కోసం రెండు వాచ్‌లను పరిచయం చేసింది. మహిళల కోసం హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్, పురుషుల కోసం క్లాసిక్స్ ప్రీమియర్ వాచీలను తీసుకొచ్చింది.
స్విస్ టెక్నాలజీ, డిజైన్లతో వీటిని తయారు చేశామని ప్రకటించింది. మహిళల కోసం రూపొందించిన హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ లో ఇంటిగ్రేటెడ్ ఇంటర్ చేంజ్‌బుల్ స్ట్రాప్ ఫీచర్ ఉంది. బ్యాటరీ ఐదేళ్లు పనిచేస్తుంది. వాచ్ లో 38.5 ఎంఎం కేస్, కాఫ్‌స్కిన్ స్ట్రాప్ ఉంటాయి.