క్రిప్టో, బ్లాక్‌‌ చెయిన్‌‌ టెక్నాలజీపై ఉచిత కోర్సు

క్రిప్టో, బ్లాక్‌‌ చెయిన్‌‌ టెక్నాలజీపై ఉచిత కోర్సు

న్యూఢిల్లీక్రిప్టో, బ్లాక్‌‌ చెయిన్‌‌ టెక్నాలజీలపై కేంద్ర ప్రభుత్వం ఉచిత కోర్సును ఆఫర్ చేస్తోంది. ప్రభుత్వానికి చెందిన లెర్నింగ్ ప్లాట్‌‌ఫామ్ ‘స్వయం’ కొత్త క్రిప్టో, బ్లాక్‌‌ చెయిన్‌‌ కోర్సులను తన ప్రొగ్రామ్‌‌లో యాడ్‌‌ చేసింది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే స్వయం(స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్) ప్రొగ్రామ్‌‌ కింద వీటిని అందించనుంది. భారత పౌరులకు ఉచితంగా ఈ పోర్టల్ ద్వారా ఆన్‌‌లైన్ కోర్సులను ఆఫర్ చేస్తోంది ప్రభుత్వం. ‘ఇంట్రడక్షన్ టూ బ్లాక్‌‌ చెయిన్ టెక్నాలజీ అండ్ అప్లికేషన్‌‌’కు ఉచితంగా ఎన్‌‌రోల్ చేసుకుని నేర్చుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది.

2020 ఫిబ్రవరి 24 నుంచి ఎఫ్‌‌డీపీ కోర్సును ఎనిమిది వారాలు ఆఫర్ చేయనున్నారు. ఇది 2020 ఏప్రిల్ 17తో ముగుస్తుంది. ఈ కోర్సును ‌‌‌‌ఐఐటీ కాన్పూర్‌‌ ప్రొఫెసర్ సందీప్ శుక్లా టీచ్ చేస్తారు. ఈ కోర్సులో బిట్ కాయిన్ బ్లాక్ చెయిన్, హ్యాషింగ్, పబ్లిక్ కీ క్రిప్టోసిస్టమ్స్, ప్రైవేట్ వర్సస్ పబ్లిక్ బ్లాక్ చెయిన్స్, వాటి వాడకం, స్క్రిప్ట్‌‌లు, ఎథెరియం, స్మార్ట్ కాంట్రాక్ట్స్ వంటి పలు టాపిక్స్‌‌ను కవర్ చేయనున్నారు. అయితే ఈ కోర్సులో సర్టిఫికేట్ కావాలనుకునే వారు మాత్రం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. వెయ్యి రూపాయలు ఫీజు కట్టి ఎగ్జామ్‌‌ను రాయాలి. ఈ ఎగ్జామ్ ఆప్షనల్. 2020 ఏప్రిల్ 25న ఎగ్జామ్ నిర్వహిస్తారు.