105 మందికి కంటి వైద్యపరీక్షలు

 105 మందికి కంటి వైద్యపరీక్షలు

లింగంపేట, వెలుగు: లింగంపేట మండలం పర్మల్ల గ్రామంలో ఆదివారం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉచిత కంటివైద్య శిబిరం నిర్వహించినట్లు వీడీసీ కమిటీ సభ్యులు తెలిపారు. వైద్య శిబిరానికి లింగంపేటలోని కంటివైద్యనిపుణుడు డాక్టర్​ బాలునాయక్​ హాజరై 105 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. 

వీరిలో 50 మందికి కంటి అద్దాలు అవసరమని, ఆరుగురికి మోతిబిందు ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. చూపు మందగించిన పలువురికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వైద్యశిబిరంలో వీడీసీ సభ్యులు కొడబోయిన సాయికుమార్, గంగారెడ్డి, సాయాగౌడ్, సిద్ధిరాములు, ఇర్ల శ్రీను, ఎల్లమయ్య, కౌడ రవి, డిష్​అశోక్ తదితరులు పాల్గొన్నారు.