హుజూరాబాద్‌‌లోని శ్రీరామ హాస్పిటల్‌‌లో ఉచిత వైద్య శిబిరం

హుజూరాబాద్‌‌లోని శ్రీరామ హాస్పిటల్‌‌లో ఉచిత వైద్య శిబిరం

హుజురాబాద్ వెలుగు: ప్రతిఒక్కరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ మోడెపు శ్రీకర్ (ఎండీ జనరల్ ఫిజీషియన్, డయోబెటాలజిస్ట్) అన్నారు. శనివారం హుజూరాబాద్‌‌లోని శ్రీరామ హాస్పిటల్‌‌లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి  హుజూరాబాద్‌‌, వివిధ గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.  ప్రతి మంగళవారం ఎఫ్‌‌బీఎస్‌‌, పీఎల్‌‌బీఎస్‌‌ ఉచిత పరీక్షలతో పాటు ఓపీ చూస్తామన్నారు. ఉచిత వైద్య శిబిరంలో సుమారు 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్‌‌ నిర్వాహకులు పాల్గొన్నారు.