కరీంనగర్ జిల్లాలో అక్రమ మైనింగ్ పై పోలీసులు కొరడా ఝులిపించారు. అక్రమంగా గ్రానైట్ రవాణ చేస్తున్న పలు వాహనాలను సీజ్ చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా గ్రానైట్ బ్లాక్ దందా చేస్తున్నట్లు గుర్తించారు. అక్రమ గ్రానైట్ రవాణాపై మైనింగ్ శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని వస్తున్న ఆరోపణల క్రమంలో తనిఖీలు చేపట్టారు పోలీసులు.
కొత్త పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోన పలు గ్రానైట్ తరలిస్తున్న లారీలను ఆపి చెక్ చేశారు పోలీసులు. ఎటువంటి అనుమతులు లేకుండా గ్రానైట్ బ్లాక్ దందా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. వారంరోజుల్లో 20 వాహనాలను సీజ్ చేశారు.
వాహనాల ఓవర్ లోడ్, అనుమతులు లేకుండా రవాణా, జీఎస్టీ చెల్లించని స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు సీజ్ చేయడంతో పోలీస్ స్టేషన్ కు క్యూకట్టారు గ్రానైన్ వ్యాపారులు. అక్రమంగా జరుగుతున్న గ్రానైట్ రవాణాపై మైనింగ శాఖ చూసి చూడనట్టు వ్యవహరిస్తోందని ఆరోపణలు వస్తున్న క్రమంలో కరీంనగర్ ట్రైనీ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. విదేశాలకు ఎగుమతి చేస్తున్న గ్రానైట్ పై నిఘా పెట్టారు.

