భారత స్వాతంత్ర్య పోరాటంలో మారుమోగిన పదం. దాదాపు 70 ఏళ్ల తర్వాత అదే పదం.. అదే స్లోగన్ ఇండియాను షేక్ చేస్తోంది. స్వాతంత్ర్య పోరులో ఆజాదీ అనే స్లోగన్.. ఎంత ఇంటెన్స్ గా మారు మోగిందో.. అంతే తీవ్రతతో ప్రతీ సిటీలోని గల్లీల్లో మారుమోగుతోంది. పేపర్ లీకేజీపై యువత, సీజేపీ మద్ధతుదారులు చేస్తున్న పోరాటంలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న ఈ పాట లేటెస్ట్ ట్రెండ్ గా నిలిచింది. సోషల్ మీడియాలో ఈ పాటతో పోస్ట్ చేసిన ఏ ఒక్క వీడియో చూసినా మిలియన్ వ్యూస్. లక్షల లైక్స్. ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న ఈ పాటకు అర్థం ఏంటో తెలుసుకుందాం.
రన్ వీర్ సింగ్ హీరోగా వచ్చిన గల్లీ బాయ్స్ సినిమాలోది ఈ పాట. ఇందులో ఫస్ట్ 20 సెకన్స్ సాంగ్.. విద్యార్థుల ప్రొటెస్టులో దద్ధరిల్లుతోంది. భుఖ్ మారీ సే.. ఆజాదీ.. హాన్ బేధ్ భావ్ సే.. ఆజాదీ.. అంటూ సాగే ఈ పాట.. విద్యార్థుల ఆందోళనకు కొత్త ఉత్ర్పేరకంగా మారింది. దీని మీనింగేంటో చూద్దాం.
సాంగ్ లిరిక్స్.. వాటి అర్థం:
భుఖ్ మారీ సే ఆజాదీ - ఆకలి కేకల నుంచి స్వాంతంత్ర్యం
హాన్ బేధ్ భావ్ సే ఆజాదీ - డిస్క్రిమినేషన్ నుంచి స్వాంతంత్ర్యం
హాన్ పక్షవాద్ సే ఆజాదీ - పక్షవాత ధోరణి నుంచి స్వాతంత్ర్యం
హాన్ భ్రష్టాచర్ చే ఆజాదీ - అవినీతి నుంచి స్వాంతంత్ర్యం
హమ్ లేకే రెహేంగే ఆజాదీ - మా స్వాంతంత్ర్యాన్ని సాధించుకుంటాం
తుమ్ కుచ్ భీ కర్లో - మీరేమైనా చేసుకోండి..
ఆజాదీ.. ఆజాదీ.. ఆజాదీ..
గల్లీ బాయ్ సినిమా.. 2019 ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైంది. జోయా అక్తర్ డైరెక్షన్ లో.. రన్ వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. అంకుర్ తివారీ మ్యూజిక్ డైరెక్షన్ లో దుబ్ శర్మ, దివినే (Dub Sharma and DIVINE) రచించిన ఈ సాంగ్ అప్పట్లో విమర్శల ప్రశంసలు అందుకుంది.
అందులో ఆజాదీ సాంగ్ లో ఉన్న మొదటి 20 లైన్స్.. ప్రస్తుతం విద్యార్థులు చేస్తున్న ఆందోళన కోసమే రాశారా అన్నట్లుగా ఉన్నాయి. ఇప్పుడు కాక్రోచ్ పార్టీ, విద్యార్థి సంఘాలు ఎలాంటి నినాదాలు ఇస్తున్నారో అవే నినాదాలు.. వ్యవస్థపై బాణాలు ఎక్కుపెట్టినట్లుగా ఒక్కో స్లోగన్ పేలుతుంటే ఉద్యమానికి ఊపిరులు ఊదినట్లుగా పేలుతోంది ఆ సాంగ్.
ఇక నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు లాఠీ చార్జీ చేసి చిత్ర హింసలు పెట్టినా.. పోలీసుల వేశం వేసుకున్న ప్రైవేటు వ్యక్తులు.. లాఠీలకు మేకులు దించి విద్యార్థుల వీపులను కుళ్లబొడిచినా.. ఎక్కడా తగ్గకుండా ధర్నాలు నిరసనలు కొనసాగిస్తున్నారు.
