జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత రెసిడెన్షియల్ పోలీస్ రిక్రూట్ మెంట్ కోచింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పేర్కొన్నారు. పోలీస్ ఉద్యోగంపై ఆసక్తి కలిగిన వారు ఈనెల 15 వరకు జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.
