ఉచితంగా స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్

ఉచితంగా స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్
ఉద్యోగాలకు కావాల్సిన స్కిల్స్​ యువతకు నేర్పడంతోపాటు, చిన్న తరహా పరిశ్రమ పెట్టేందుకు అవసరమైన నైపుణ్యాలు అందిస్తోంది హైదరాబాద్​లోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఫర్​ మైక్రో, స్మాల్​, మీడియం ఎంటర్​ప్రైజెస్(నిమ్స్​మే). యానిమేషన్​, అకౌంట్స్​, క్లౌడ్​ ఇంజినీర్​ తదితర 11 రకాల షార్ట్​ టర్మ్​ కోర్సులను ఆన్​లైన్​, ఆఫ్​లైన్​లో ఉచితంగా అందిస్తోంది.  ఆసక్తి గల యువత ఆన్​లైన్​లో రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. కాలేజీల్లో కేవలం బుక్ నాలెడ్జ్ మాత్రమే నేర్పుతున్నరు. అసలు కొలువుల ఎట్ల ఉంటదో, అక్కడ ఏం చేయాలో ఎక్కడా నేర్పడం లేదు. దీంతో చాలా మంది స్టూడెంట్స్​ క్యాంపస్ సెలక్షన్స్​, జాబ్‌‌ మేళాల్లో సెలెక్ట్ కాలేకపోతున్నరు. అలాంటి గ్యాప్‌‌ను తొలగించేందుకు, అసలు జాబ్‌‌కు కావాల్సిన స్కిల్‌‌ను అందివ్వడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు రకరకాల కోర్సులు పెడుతున్నయి. కోర్సును బట్టి టైం, జాబ్‌‌ను బట్టి ట్రైనింగ్ ఇస్తున్నరు. అలాంటి ఒక సంస్థనే హైదరాబాద్‌‌లోని నిమ్స్ మే (నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రైజెస్). యూసుఫ్‌‌గూడ నుంచి రహ్మత్‌‌నగర్ వెళ్లే దారిలో ఉన్న ఈ సంస్థ నిరుద్యోగ యువతకు, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌కు మధ్య వారధిలా పనిచేస్తున్నందుకు మదర్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌షిప్ అని పిలుస్తుంటారు. స్కిల్ డెవలప్‌‌మెంట్ కోర్సులు.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌లో నిరుద్యోగ యువత కోసం ఈఎస్‌‌డీపీ(ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌షిప్ డెవలప్‌‌మెంట్ ప్రోగ్రామ్స్) విభాగం పనిచేస్తోంది. ఇందులో ఏటీఐ (అపెక్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్) సుమారు 11 రకాల స్కిల్ డెవలప్‌‌మెంట్ ప్రోగ్రాంలను అందిస్తోంది.  టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్న నిరుద్యోగ యువత కోసం స్పెషల్ ప్రోగ్రాంలు డిజైన్ చేశారు.   . ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ విధానం ఆధారంగా ప్రతి కోర్సుకు 20 నుంచి 30 మందికి మాత్రమే అడ్మిషన్ ఉంటుంది. ఈ కోర్సులన్నీ కేంద్ర మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌‌‌‌ప్రైజెస్ శాఖ స్పాన్సర్ చేస్తోంది. క్యాంపస్ వదిలివెళ్లినా.. కోర్సులో జాయినయ్యాక కచ్చితంగా 80శాతం హాజరుండాలి. నేర్చుకునే అంశం పట్ల శ్రద్ధ లేకున్నా అటెండెన్స్ తక్కువున్నా కోర్సు నుంచి టర్మినేట్ చేస్తారు. కోర్సు పూర్తి చేసి వెళ్లాక క్యాంపస్‌‌తో అనుబంధం పోయినట్లు కాదు. వారు ప్రతి నెలా వారి స్టూడెంట్స్ గురించి రివ్యూ తీసుకుంటారు. జాబ్ మేళా నిర్వహించినప్పుడు వీరికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. బిజినెస్ చేసే ఉద్దేశముందని చెప్తే దానికి కావాల్సిన మెలకువలు నేర్పిస్తారు. బిజినెస్ చేసేవారి కోసం.. బిజినెస్ చేస్తామనే వారికోసం నిమ్స్ మేలో ప్రత్యేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి.  మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌ను ఎంకరేజ్ చేయడం కోసం వీటిని తీసుకొచ్చింది.  ఒక కంపెనీ స్టార్ట్ చేయడం దగ్గర నుంచి అది ఎలా నిలబెట్టుకోవాలో అన్ని స్కిల్స్​ నేర్పుతారు.  ఫండింగ్, డాక్యుమెంటేషన్, డిజైన్ విషయంలో గైడెన్స్ చేస్తారు. దీంతోపాటు ఇంక్యుబేషన్ కేంద్రాలున్నాయి. నిమ్స్ మేలో ప్రతి సంవత్సరం జాబ్ మేళా నిర్వహిస్తారు. ప్రస్తుతం ట్రైనింగ్​ ఇవ్వనున్న కోర్సులు వీఎ‌‌ఫ్‌‌‌‌ఎక్స్‌‌, యాని‌‌మే‌‌షన్​, అకౌంట్‌‌ ఎగ్జి‌‌క్యూ‌‌టివ్‌‌ , బేకింగ్‌‌ టెక్నీ‌‌షి‌‌యన్‌‌ కోర్సుల్లో ప్రస్తుతం అడ్మిషన్స్​ తీసుకుంటున్నారు. డిగ్రీ, బీటెక్‌‌ చదివి 35 ఏండ్లలోపు ఉన్న వారు వీఎ‌‌ఫ్‌‌‌‌ఎక్స్‌‌, యాని‌‌మే‌‌షన్​ కోర్సు‌‌లకు అర్హులు వారికి ఆఫ్‌‌‌‌లై‌‌న్‌‌లో 280 గం‌‌టలు ట్రైనింగ్ నిర్వహించనున్నారు. అకౌంట్స్‌‌ ఎగ్జి‌‌క్యూ‌‌టి‌‌వ్‌‌కు టెన్‌‌ ప్లస్‌‌ టూ అర్హత ఉండి 35 ఏండ్ల లోపు వారికి 120 రోజుల పాటు, బేకింగ్‌‌ టెక్నీ‌‌షి‌‌య‌‌న్‌‌కు పదో‌‌త‌‌ర‌‌గతి అర్హత‌‌ఉండి 35 ఏండ్ల వ‌‌యసు వారికి 240 గంటల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. అప్లై చేసుకోవాలనుకునే వారు నిమ్స్‌‌మే వెబ్‌‌‌‌సైట్‌‌ www.nimsme.org లో ఆన్‌‌‌‌లై‌‌న్‌‌ రిజిస్ట్రేషన్​ చేసు‌‌కో‌‌వాలి. వచ్చే జనవరి 6 నుంచి 8 వరకు మూడు రోజులు జీఎస్టీ రిజిస్ట్రేషన్​, ఇన్​పుట్​ ట్యాక్స్​, క్రెడిట్​, రిటర్న్​ అండ్​ పేమెంట్​ ఆఫ్​ ట్యాక్స్​ అండర్​ జీఎస్టీ, రిటర్న్​ ఫైలింగ్​, ట్యాలీ సాఫ్ట్​వేర్​, అకౌంట్స్​పై ట్రైనింగ్​ ఇవ్వనుంది. పూర్తి వివ‌‌రా‌‌ల కోసం నిమ్స్​మే హెచ్​ఆర్​ లీడ్(ఏటీఐ)​శశిధర్.ఏ​ (8886115359) లేదా  040–23633218, 99857 48780, 93465 11344, 93912 22975 నంబ‌‌ర్లలో సంప్రదించాలి. For More News.. ప్రభుత్వ కంపెనీ వాటాలపై మైనింగ్‌ మొఘల్‌ గురి! రాత పరీక్ష లేకుండా బ్యాంక్ జాబ్ విరాట్‌‌ నావల్లే అవుట్ అయ్యాడు.. లేకపోతే మ్యాచ్ పోయేది కాదు పార్కింగ్ ప్లేస్‌‌‌‌‌‌‌‌లు లేవు కానీ.. బండ్లకు ఫైన్లు