18 ఏళ్లు పైబడిన వారందరికీ ఫ్రీ వ్యాక్సిన్

18 ఏళ్లు పైబడిన వారందరికీ ఫ్రీ వ్యాక్సిన్

దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనాను అరికట్టేందుకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమన్న నిపుణులు అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని స్పీడప్ చేసింది. ఇప్పటి వరకు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు, 45 ఏళ్లు నిండిన వారికి టీకాలు ఇచ్చేకార్యక్రమం చేపట్టిన కేంద్రం.. మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ టీకా అందజేసేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే రాష్ట్రాలు నేరుగా టీకా తయారీ సంస్థల దగ్గరనే వ్యాక్సిన్లు కొనుగోలు చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది.

దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతుగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎవరూ టీకాకు దూరం కావొద్దని భావించిన కొన్ని రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 18 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించాయి.  ఉత్తరప్రదేశ్‌, అస్పాం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు ఫ్రీగా టీకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించాయి. వ్యాక్సిన్లకు అయ్యే ఖర్చు ప్రభుత్వాలే భరించనున్నట్లు ఆయా రాష్ట్రాల సీఎంలు తెలిపారు.