అన్‌స్టాపబుల్‌.. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నడాల్​కు 14వ టైటిల్

 అన్‌స్టాపబుల్‌.. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నడాల్​కు 14వ టైటిల్
  • 22 గ్రాండ్‌‌స్లామ్స్‌‌తో సరికొత్త రికార్డు
  • ఫైనల్లో రూడ్‌‌పై  సూపర్‌‌ విక్టరీ
  • ఫ్రెంచ్​ ఓపెన్​ నెగ్గిన ఓల్డెస్ట్​  ప్లేయర్​గా మరో ఘనత
  • నడాల్​.. 22 గ్రాండ్​స్లామ్స్​తో రికార్డు


క్లే కోర్టుపై తనకు ఎదురు లేదని స్పెయిన్​ టెన్నిస్​ లెజెండ్​ రఫెల్​ నడాల్ మరోసారి చాటి చెప్పాడు. వయసు పెరుగుతున్నా తన ఆటలో వన్నె తగ్గలేదని నిరూపిస్తూ ఫ్రెంచ్​ ఓపెన్‌‌​లో 14వ సారి విజేతగా నిలిచి తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. ఆదివారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో 6-3, 6-3, 6-0 తేడాతో నార్వే ఆటగాడు కాస్పర్​ రూడ్​ను వరుస సెట్లలో చిత్తు చేశాడు. ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌లో  విజేతగా నిలిచిన ఓల్డెస్ట్‌‌ ప్లేయర్‌‌గా 36 ఏండ్ల రఫెల్​ రికార్డు సృష్టించాడు.  ఓవరాల్​గా 22వ గ్రాండ్​స్లామ్​ సొంతం చేసుకొని మెన్స్​ సింగిల్స్​లో అత్యధిక మేజర్​ టైటిళ్లు నెగ్గిన ఆటగాడిగానూ తన రికార్డును మరింత మెరుగు పరుచుకున్నాడు. చెరో 20 గ్రాండ్​స్లామ్స్​తో ఉన్న రోజర్​ ఫెడరర్​, నొవాక్​ జొకోవిచ్​కు అందనంత ఎత్తులో నిలిచాడు.
 

పారిస్‌‌‌‌‌‌‌‌‌‌: స్పెయిన్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌ స్టార్‌‌‌‌ రఫెల్‌‌‌‌ నడాల్‌‌‌‌.. మట్టి (క్లే) కోర్టుకు మహారాజు తానేనని మరోసారి నిరూపించుకున్నాడు. ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో బరిలోకి దిగిన 19 పర్యాయాల్లో 14సార్లు టైటిల్‌‌‌‌ గెలిచి అద్భుతం చేశాడు. తాజాగా ఆదివారం జరిగిన టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌లో ఐదోసీడ్‌‌‌‌ నడాల్‌‌‌‌ 6–3, 6–3, 6–0తో ఎనిమిదోసీడ్‌‌‌‌ కాస్పర్‌‌‌‌ రూడ్‌‌‌‌ (నార్వే)పై ఏకపక్షంగా గెలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. దీంతో మెన్స్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌ హిస్టరీలో 22 గ్రాండ్‌‌‌‌స్లామ్స్‌‌‌‌ నెగ్గిన తొలి ప్లేయర్‌‌‌‌గా తన రికార్డును పొడిగించుకున్నాడు. రోజర్‌‌‌‌ ఫెడరర్‌‌‌‌ (20), జొకోవిచ్‌‌‌‌ (20) సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు. 36 ఏండ్ల వయసులో  ఫ్రెంచ్​ ఓపెన్​ నెగ్గిన ఓల్డెస్ట్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌గానూ రఫా రికార్డులకెక్కాడు. 2005లో 19 ఏళ్ల వయసులో పారిస్‌‌‌‌లో తొలి టైటిల్‌‌‌‌ గెలిచిన స్పెయిన్‌‌‌‌ బుల్‌‌‌‌.. ఒకే గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌ను అత్యధిక సార్లు సాధించిన ప్లేయర్‌‌‌‌గానూ రికార్డు సాధించాడు. మెన్స్‌‌‌‌, విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో మరే  ప్లేయర్​ ఒకే గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌ను 14 సార్లు గెలవలేదు. ఇక రోలాండ్‌‌‌‌ గారోస్‌‌‌‌లో ఫైనల్స్​ రికార్డును 14–0కు పెంచుకున్న నడాల్‌‌‌‌.. ఓవరాల్‌‌‌‌ టోర్నీలో విజయాల సంఖ్య 112–3గా ఉంది. 
వరుసగా 11 గేమ్స్‌‌‌‌ గెలిచి..
క్లే కోర్టుపై విశేషమైన అనుభవంతో, బలమైన సర్వీస్‌‌‌‌లు, పదునైన గ్రౌండ్‌‌‌‌ షాట్స్‌‌‌‌తో రెచ్చిపోయిన నడాల్‌‌‌‌.. 2 గంటలా 18 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో ఎక్కడా తగ్గలేదు. కెరీర్‌‌‌‌లో తొలి మేజర్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ ఆడుతున్న రూడ్‌‌‌‌ను బ్యాక్‌‌‌‌హ్యాండ్‌‌‌‌ షాట్లతో బేస్‌‌‌‌లైన్‌‌‌‌కే పరిమితం చేశాడు. తొలి సెట్‌‌‌‌ రెండో గేమ్‌‌‌‌లో రూడ్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ను బ్రేక్‌‌‌‌ చేసిన నడాల్‌‌‌‌.. తర్వాతి గేమ్‌‌‌‌లో సర్వ్‌‌‌‌ను కోల్పోయాడు. అయినప్పటికీ స్పెయిన్‌‌‌‌ స్టార్‌‌‌‌ నాలుగో గేమ్‌‌‌‌ బలమైన ఫోర్‌‌‌‌హ్యాండ్‌‌‌‌ షాట్‌‌‌‌తో రూడ్‌‌‌‌ సర్వ్‌‌‌‌ను బ్రేక్‌‌‌‌ చేశాడు. ఫలితంగా 3–1లోకి వెళ్లాడు.

తర్వాత తన సర్వ్‌‌‌‌లను కాపాడుకుంటూ ఈజీగా తొలి సెట్‌‌‌‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌‌‌‌నాలుగో గేమ్‌‌‌‌లో నడాల్‌‌‌‌ సర్వ్‌‌‌‌ను బ్రేక్‌‌‌‌ చేసిన రూడ్‌‌‌‌ 3–1 లీడ్‌‌‌‌తో పుంజుకున్నాడు. కానీ ఇక్కడి నుంచి సుడిగాలిలా రెచ్చిపోయిన నడాల్‌‌‌‌ బలమైన సర్వీస్‌‌‌‌లతో నార్వే ప్లేయర్‌‌‌‌ను హడలెత్తించాడు. వరుసగా 11 గేమ్స్‌‌‌‌ గెలిచి రూడ్‌‌‌‌కు చెక్‌‌‌‌ పెట్టాడు. థర్డ్‌‌‌‌ సెట్‌‌‌‌లో ప్రత్యర్థికి కనీసం ఒక్క గేమ్‌‌‌‌ కూడా గెలిచే చాన్స్‌‌‌‌ ఇవ్వకుండా సెట్​తో పాటు చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కచ్చితత్వంతో కూడిన షాట్లతో చాలా క్లీన్‌‌‌‌ అండ్‌‌‌‌ క్లియర్‌‌‌‌ గేమ్‌‌‌‌ ఆడిన నడాల్‌‌‌‌ 37 విన్నర్స్‌‌‌‌ కొడితే రూడ్‌‌‌‌ 16తో సరిపెట్టుకున్నాడు. నడాల్‌‌‌‌ 18, రూడ్‌‌‌‌ 26 అన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌ చేశారు. 
గాఫ్‌‌‌‌కు ‘డబుల్‌‌’ నిరాశ
విమెన్స్‌‌ సింగిల్స్‌‌లో రన్నరప్‌‌తో సరిపెట్టుకున్న అమెరికా స్టార్‌‌ కొకో గాఫ్‌‌కు.. డబుల్స్‌‌లోనూ నిరాశే ఎదురైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో గాఫ్‌‌–పెగులా (అమెరికా) 6–2, 3–6, 2–6తో గార్సియా–మల్డోనోవిచ్‌‌ (ఫ్రాన్స్‌‌) చేతిలో ఓడి రన్నరప్‌‌తో సంతృప్తి పడింది. గంటా 44 నిమిషాల మ్యాచ్‌‌లో అమెరికా జోడీ ఒక్క ఏస్‌‌ కూడా కొట్టలేదు.
టెన్నిస్​ చరిత్రలో ఇది పురాతనమైన టోర్నీ.  వరల్డ్‌‌‌‌లోనే బెస్ట్‌‌‌‌ టోర్నమెంట్. దీన్ని నా సొంతింటిలా భావిస్తాను. ఈ క్షణాన నా భావాలను వివరించడం చాలా కష్టంగా అనిపిస్తోంది. 36 ఏండ్ల వయసులో నేనిక్కడ పోటీపడతానని అనుకోలేదు. కానీ మరోసారి ఫైనల్‌‌‌‌ ఆడటం ద్వారా నాలో ఆట మిగిలే ఉందని నమ్ముతున్నా.  నా ఆటను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇది శక్తిని ఇస్తుందని భావిస్తున్నా. ఫ్యూచర్‌‌‌‌లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ నా ఆటను  కొనసాగించడానికి ప్రయత్నిస్తా. శరీరం సహకరిస్తే వింబుల్డన్​లో ఆడతా. ‑ నడాల్‌‌‌‌

 

మరిన్ని వార్తలు..

బీజేపీలో ఫుల్ జోష్.. పదవుల రేసులో లీడర్లు

6న ఏపీ టెన్త్‌ ఫలితాల విడుదల