మళ్లీ వచ్చింది.. ఆఫ్ఘనిస్తాన్ ను వదలని భూకంపాలు

మళ్లీ వచ్చింది.. ఆఫ్ఘనిస్తాన్ ను వదలని భూకంపాలు

పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భూప్రకంపనలతో వణికిపోయింది. హెరాత్ నగరానికి సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది. ఇది 6.3 కిమీ (నాలుగు మైళ్ళు) లోతులో ఏర్పడినట్టు వెల్లడించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.

Also Read :- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

అంతకుముందు సంభవించిన వరుస భూకంపాలలో మరణించిన వారిలో 90% కంటే ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారని UN పిల్లల ఏజెన్సీ యూనిసెఫ్ తెలిపింది. ఈ భూకంపాలతో అనేక మంది నివాసితులు నిరాశ్రయులయ్యారు, చాలా మంది గాయాల పాలయ్యారు. అయితే ఈ ప్రకంపనల కారణంగా దాదాపు 12వేల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.