మరో 54 చైనా యాప్స్పై నిషేధించిన భారత్

మరో 54 చైనా యాప్స్పై నిషేధించిన భారత్

దేశ భద్రతకు ముప్పు కలిగించే.. చైనీస్ యాప్ లపై మరోసారి భారత ప్రభుత్వం కొరడా ఝలిపించింది. 2020లో 224 చైనా యాప్ లపై బ్యాన్ విధించిన.. కేంద్రం తాజాగా 54 చైనీస్ యాప్ లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. బ్యూటీ కెమెరా, స్వీట్ సెల్ఫీ హెచ్ డీ, బ్యూటీ కెమెరా- సెల్ఫీ కెమెరా, ఈక్వలైజర్ అండ్ బాస్ బూస్టర్, క్యామ్ కార్డ్ ఫర్ సేల్స్ ఫోర్స్ ఈఎన్టీ, ఐసోలాండ్-2 యాషెస్ ఆఫ్ టైమ్ లైట్, వీవా వీడియో ఎడిటర్, ఆన్ మైయోజీ చెస్, ఆన్ మై ఓజీ ఎరీనా, యాప్ లాక్, డ్యూయల్ స్పేస్ లైట్ యాప్ లను నిషేధించినట్లు తెలిపాయి కేంద్ర వర్గాలు.

వ్యక్తిగత భద్రత, ప్రైవసీకి భంగం కలిగిస్తుండడంతో కేంద్రం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం బ్యాన్ చేసిన యాప్ లలో ఎక్కువ భాగం టెన్సెంట్, అలీబీబా, నెట్ఈజ్ కంపెనీలకు చెందినవని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. భారతీయులకు సంబంధించిన సెన్సిటివ్ సమాచారాన్ని చైనాలో ఉన్న సర్వర్లకు చేరవేస్తున్నట్లు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇకపై ప్లే స్టోర్ లో కూడా ఈ యాప్స్ మన దేశంలో అందుబాటులో ఉండవని అన్నారు. ఐటీ యాక్ట్ 69ఏ ప్రకారం ఈ యాప్స్ పై బ్యాన్ ఆదేశాలిచ్చినట్లు చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

భీమ్లా నాయక్ నుంచి కొత్త కబురు

అన్న కోసం ప్రాణాలైనా ఇస్తా

అమెరికన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లవ్..  ఇండియాలో!