ఫ్రైడ్ ఐస్ క్రీం.. వైరల్ అవుతోన్న వెరైటీ రెసిపీ

ఫ్రైడ్ ఐస్ క్రీం.. వైరల్ అవుతోన్న వెరైటీ రెసిపీ

ఐస్ క్రీం అంటే చల్లగా ఉండేది.. అలాంటి క్రీమ్ కు వేడి తగిలితే కరిగిపోతుంది.. మరి అలాంటి ఐస్ క్రీంను ప్రైడ్ గా చేసి ఇస్తామంటే.. వినటానికే వింత..

రుచి, ఊహ సరిహద్దులను పక్కకు తోసేసే అసాధారణ ఆహార వంటకాలకు ఇంటర్నెట్ ఓ ప్లే గ్రౌండ్ గా మారింది. థంబ్స్ అప్ పానీపూరీ, రస్గుల్లా చాయ్, ఇడ్లీ కుల్ఫీ వంటి విచిత్రమైన కాంబినేషన్లు గతంలో కొందరు ప్రయత్నించిన వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సమ్మర్ లో చాలా మంది ఇష్టపడే ఐస్ క్రీం తో ఓ వెరైటీ హల్ చల్ చేస్తోంది. ఫుడ్ వ్లాగర్ సలోని బోత్రా ఈ అసాధారణమైన ట్రీట్‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో గడ్డగా ఉన్న తియ్యని వెనీలా ఐస్ క్రీం ను తీసి ఓ గిన్నెలో వేసి, దాన్ని ఓ బాల్ లా చేయడం చూడవచ్చు. దానికి బ్రెడ్ ముక్కల పొడిలో కలిపి, ఆ తర్వాత ఆ బాల్ ను నూనెలో వేయించారు. అది గొధుమ రంగు వచ్చే వరకు ఉంచి.. దాన్ని సర్వింగ్ బౌల్ లో వేస్తారు. ఆ తర్వాత దానిపై చాకోలెట్ క్రీమీని పోస్తారు. అలా ఏర్పడ్డ మిశ్రమాన్ని స్పూన్ తీయడం అందర్నీ ఆకర్షిస్తోంది.

ఈ వెరైటీ రెసిపీకి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. “నేను దీన్ని ప్రయత్నించాను . ఇది చాలా రుచికరమైనది. అవును.. మీరందరూ నన్ను సైకో అంటారేమో.. కానీ అది చాలా బాగుంది" అంటూ ఓ యూజర్ రాసుకొచ్చారు. కాగా ఈ వైరల్ వీడియోకు 67వేల లైకులు, వెయ్యి కామెంట్స్, 86వేల షేర్స్ వచ్చాయి.

https://www.instagram.com/reel/Cr3ctPgoDKj/?utm_source=ig_embed&ig_rid=65c0f5f1-03df-45f7-a806-687aed69c03d