గొప్పవి ఎప్పుడూ ఒకటేగా.. మనమే సినిమా నుంచి పస్ట్ సింగిల్ రిలీజ్

గొప్పవి ఎప్పుడూ ఒకటేగా.. మనమే సినిమా నుంచి పస్ట్ సింగిల్ రిలీజ్

శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మనమే’. షూటింగ్ పూర్తి చేసి మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. గురువారం ఫస్ట్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. కృష్ణ  చైతన్య క్యాచీ లిరిక్స్ రాయగా.. హేషమ్ అబ్దుల్ వహాబ్ ట్యూన్ చేయడంతో పాటు తనే పాడిన విధానం ఆకట్టుకుంది. ‘ఐఫిల్ టవరే ఒంటరిగా..  ఉండే చాలా అందంగా.. గొప్పవి ఎప్పుడూ ఒకటేగా.. తెలుసా దిల్ రుబా..మిలియన్ డాలర్ ఫ్రీడమ్.. సింగిల్‌‌కే రా సొంతం’ అంటూ సాగిన పాటలో శర్వానంద్ స్టైలిష్ లుక్‌‌తో పాటు ఇంప్రెస్ చేసే డ్యాన్స్ మూమెంట్స్‌‌తో మెస్మరైజ్ చేస్తున్నాడు.

లండన్‌‌లో బ్యూటిఫుల్ లొకేషన్స్‌‌  మధ్య చిత్రీకరించిన పాట విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.  శర్వానంద్ కెరీర్‌‌‌‌లో ఇది 35వ చిత్రం. కృతిశెట్టి హీరోయిన్‌‌. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత.