
ఐపీఎల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ రెండున్నర నెలల పాటు ఫ్యాన్స్ను అలరించనుంది. ఈ మేరకు ఐపీఎల్ షెడ్యూల్ను ఐసీసీ పొడిగించింది. దీనికి సంబంధించి అధికారిక అనుమతులు ఐసీసీ నుంచి లభించినట్లు తెలుస్తోంది.
ఐసీసీ తన భవిష్యత్ టూర్స్ ప్రోగ్రామ్స్ను ప్రకటించింది. 2023 నుంచి 2027 వరకు ఐసీసీ క్రికెట్ సిరీస్లు, వరల్డ్ కప్ షెడ్యూల్ను వెల్లడించింది. ఇందులో ఐపీఎల్తో పాటు బిగ్ బాష్ లీగ్, హండ్రెడ్ టోర్నీలకు ఐసీసీ స్థానం కల్పించింది. ఈ రెండు మెగా ఈవెంట్లను తన ప్రోగ్సామ్స్ షెడ్యూల్ చేర్చడం ద్వారా క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డులకు వెసులుబాటు కల్పించింది.
ఐపీఎల్@రెండున్నర నెలలు..
ఐసీసీ తన ప్రోగ్రామ్స్లో ఐపీఎల్ను కూడా చేర్చింది. సాధారణంగా ఐపీఎల్ మార్చి లాస్ట్ వీక్లో మొదలై..మే చివరి వారంలో ముగుస్తుంది. అయితే దీన్ని పొడిగించేందుకు బీసీసీఐ ఐసీసీకి ప్రతిపాదనలు కూడా పంపింది. కనీసం రెండున్నర నెలల పాటు ఐపీఎల్ను నిర్వహించాల్సి ఉంటుందని ఐసీసీని కోరింది. కొత్త ఫ్రాంచైజీలను తీసుకోవడం వల్ల మ్యాచ్ల సంఖ్య పెరుగుతుందని..దీనికి అనుగుణంగా ఐపీఎల్ను పొడిగించాల్సి ఉంటుందని ప్రతిపాదనల్లో పేర్కొంది. ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. ఐసీసీ తన టూర్స్ ప్రోగ్రామ్స్లో ఐపీఎల్ను రెండున్నర నెలల పాటు షెడ్యూల్ చేసింది. దీని ప్రకారం 2023 నుంచి 2027 వరకు ఐపీఎల్ జరుగుతున్న సమయంలో..ఇంటర్నేషనల్ క్రికెట్ షెడ్యూల్ ఉండవు. దీని తర్వాత హండ్రెడ్ లీగ్, బిగ్ బాష్ లీగ్స్ జరగనున్నాయి. ఫలితంగా ఈ లీగ్స్లలో వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు ఆడే అవకాశం కలిగింది.
2023, 2024 ఐపీఎల్ సీజన్లలో 74 మ్యాచులు జరగనున్నాయి. ఇక 2025,2026 ఐపీఎల్ సీజన్ల లో 84 మ్యాచులు, 2027 ఐపీఎల్లో 94 మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతీ ఏడాది- జులై నుంచి ఆగస్టు మధ్యకాలంలో హండ్రెడ్ లీగ్ జరిగే ఛాన్సుంది. ప్రస్తుతం ఐపీఎల్, హండ్రెడ్ లీగ్, బిగ్ బాష్ లీగ్స్‌ను ఐసీసీ తన టూర్ ప్రోగ్రామ్స్ చేర్చిన ఐసీసీ... వీటితో పాటు...ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నీలను కూడా ఐసీసీ పరిశీలిస్తోంది.