ఇండియాకు కఠిన పరీక్ష: ఇంగ్లండ్‌‌తో ఫోర్త్‌‌ టెస్ట్‌‌

ఇండియాకు కఠిన పరీక్ష: ఇంగ్లండ్‌‌తో ఫోర్త్‌‌ టెస్ట్‌‌
  • బ్యాటింగ్‌‌పైనే ప్రధానంగా దృష్టి
  • తుది జట్టులో అశ్విన్‌‌కు ప్లేస్‌‌!
  • మ. 3.30 నుంచి సోనీ సిక్స్‌‌లో 

లండన్‌‌: వైస్‌‌ కెప్టెన్‌‌ అజింక్యా రహానె ఫామ్‌‌లేమి.. సీనియర్‌‌ ఆఫ్‌‌ స్పిన్నర్‌‌ రవిచంద్రన్‌‌ అశ్విన్‌‌ను తుది జట్టులోకి తీసుకోవడం.. ఈ రెండు అంశాలపైనే ఎక్కువ చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఇండియా మరో కీలక టెస్ట్‌‌కు సిద్ధమైంది. గురువారం నుంచి జరిగే ఫోర్త్‌‌ టెస్ట్‌‌లో బలమైన ఇంగ్లండ్‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. లార్డ్స్‌‌లో గెలిచిన తర్వాత.. బ్యాటింగ్‌‌లో ఘోర వైఫల్యంతో థర్డ్‌‌ టెస్ట్‌‌ను చేజార్చుకున్న కోహ్లీసేన ఈ మ్యాచ్‌‌పై స్పెషల్‌‌ ఫోకస్‌‌ పెట్టింది. 
తుది కూర్పు ఎలా?
ఓపెనర్లలో రోహిత్‌‌ ఫర్వాలేదనిపిస్తున్నా.. రాహుల్‌‌ గాడిలో పడాల్సి ఉంది. మిడిల్‌‌లో కెప్టెన్‌‌ కోహ్లీ, పుజారా, రహానె ఇన్నింగ్స్‌‌ను నిలబెట్టలేకపోవడం అతిపెద్ద ప్రతికూలాంశం. అయితే మూడో టెస్ట్‌‌లో 91 రన్స్‌‌ చేయడంతో వేటు నుంచి పుజారా తప్పించుకున్నాడు. కానీ రహానెను ఏం చేస్తారన్నదే పెద్ద ప్రశ్న. మెల్‌‌బోర్న్‌‌లో హాఫ్‌‌ సెంచరీ తర్వాత మొన్న లార్డ్స్‌‌లో 61 రన్స్‌‌ చేశాడు. కాబట్టి ఈ రెండు పెర్ఫామెన్స్‌‌లను పరిగణనలోకి తీసుకుని అతన్ని కొనసాగించడం కష్టమైన పనే. దీనికితోడు యంగ్‌‌స్టర్స్‌‌ సూర్యకుమార్‌‌ యాదవ్‌‌, హనుమ విహారి టీమ్‌‌లో ప్లేస్‌‌ కోసం ఎదురుచూస్తున్నారు. కాబట్టి మేనేజ్‌‌మెంట్‌‌ ఏదో ఒక మేజర్‌‌ డెసిషన్‌‌ తీసుకోక తప్పదు. ఒకవేళ రహానెను తప్పిస్తే ఆ ప్లేస్‌‌లో విహారిని తీసుకోవడం బెస్ట్‌‌ ఆప్షన్‌‌. ఎందుకంటే హైదరాబాదీ ఆఫ్‌‌ బ్రేక్‌‌ కూడా వేయగలడు. మోకాలి గాయం నుంచి జడేజా కూడా కోలుకున్నాడు. కాబట్టి స్పిన్నర్‌‌గా జడ్డూ, అశ్విన్‌‌లో ఎవర్ని తీసుకుంటారో చూడాలి. ఒకవేళ అశ్విన్‌‌ వస్తే రూట్‌‌కు ఇబ్బందులు తప్పవు. పేసర్లలో బుమ్రా, షమీ, సిరాజ్‌‌కు తోడు ఉమేశ్‌‌, శార్దూల్‌‌లో ఒకరు టీమ్‌‌లోకి రావొచ్చు. అయితే వర్క్‌‌లోడ్‌‌ను దృష్టిలో పెట్టుకుని స్టాండ్‌‌బైగా ఉన్న పేసర్‌‌ ప్రసీధ్‌‌ కృష్ణను టీమ్‌‌లోకి తీసుకున్నారు. యాంకిల్‌‌ గాయంతో ఇబ్బందిపడుతున్న ఇషాంత్‌‌కు ప్లేస్‌‌ కష్టమే. 
జట్లు (అంచనా)
ఇండియా: కోహ్లీ (కెప్టెన్), రాహుల్‌‌, రోహిత్‌‌, పుజారా, రహానె, పంత్‌‌, జడేజా / అశ్విన్‌‌, శార్దూల్‌‌ ఠాకూర్‌‌ / ఇషాంత్‌‌ శర్మ, షమీ / ఉమేశ్‌‌ యాదవ్‌‌, బుమ్రా, సిరాజ్‌‌. ఇంగ్లండ్‌‌: రూట్‌‌ (కెప్టెన్‌‌), బర్న్స్‌‌, హమీద్‌‌, మలన్‌‌, పోప్‌‌, బెయిర్‌‌స్టో, మొయిన్‌‌ అలీ, వోక్స్‌‌, ఓవర్టన్‌‌, రాబిన్సన్‌‌, అండర్సన్‌‌.