సహజ వ్యర్థాలతో 'అవతార్' నటుల బొమ్మలు తయారు చేసిన విద్యార్థులు

సహజ వ్యర్థాలతో 'అవతార్' నటుల బొమ్మలు తయారు చేసిన విద్యార్థులు

' అవతార్ : ది వే ఆఫ్ వాటర్' బాక్సాఫీస్ వద్ద విజయవంతమవడమే కాదు.. పిల్లలను సృజనాత్మకంగానూ ప్రేరేపిస్తోంది. పుదుచ్చేరిలోని సెలియమేడు గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్‌కు చెందిన విద్యార్థుల బృందం జేమ్స్ కామెరూన్ సృష్టించిన బ్లాక్‌బస్టర్‌పై తమ ప్రేమను నిరూపించుకున్నారు. సినిమాలోని ప్రధాన పాత్రలైన నెయిటిరి, జేక్ సుల్లీ, గ్రేట్ లియోనోప్టెరిక్స్ బొమ్మలను రూపొందించారు. అది కూడా చెత్త, అవసరం లేని సహజ వ్యర్థ పదార్థాలతో సంతోష్, నవనీత కృష్ణన్ అనే ఇద్దరు విద్యార్థులు హీరో, హీరోయిన్ ను స్వాగతించే విధంగా బొమ్మలను రూపొందించారు. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలోని పాత్రలను అనుకరిస్తూ నిష్కళంకమైన బొమ్మలను రూపొందించడానికి వీరికి ఒక వారం పట్టింది. కొబ్బరి చిప్పలు, మందార ఆకులు, తాటి ఆకులు వంటి గ్రామీణ ప్రాంతాలలో సులభంగా లభించే సహజ వ్యర్థ పదార్థాల నుండి వీటిని సృష్టించడం గొప్ప విషయం.

గతంలోనూ ఈ విద్యార్థులు తమిళిసై శిల్పాన్ని తయారు చేశారు. ఇది చుట్టుపక్కల ప్రజల నుండి గొప్ప ప్రశంసలను పొందింది. ఇప్పుడు ' అవతార్ : ది వే ఆఫ్ వాటర్'లోని క్యారెక్టర్ లను వ్యర్థ పదార్థాలతో తయారుచేసి మరో సారి తమ టాలెంట్ నిరూపించుకున్నారు. ఈనెల 16న తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో విడుదలైన ఈ మూవీకి దేశ వ్యాప్తంగా మంచి టాక్ వస్తోంది. అంతేకాదు ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రకారం... ' అవతార్ : ది వే ఆఫ్ వాటర్' భారతదేశం అంతటా రికార్డు స్థాయిలో రూ.41 కోట్లకు చేరుకుంది.