జీఎస్టీపై ఎఫ్​టీసీసీఐ సమావేశం

జీఎస్టీపై ఎఫ్​టీసీసీఐ సమావేశం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్​టీసీసీఐఐ) శనివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో "జీఎస్టీ  గ్లోబలైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కాన్​క్లేవ్​"  నిర్వహించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైకోర్టు రిటైర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చల్లా కోదండరామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చీఫ్ ​గెస్ట్​గా హాజరయ్యారు. ట్యాక్స్ ప్రాక్టీషనర్లు, కన్సల్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఐటీ, జీఎస్టీ ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల ప్రతినిధులతో కూడిన 250 మందికి పైగా ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఈ పన్ను విధానం దేశాన్ని ఏకం చేసిందని అన్నారు.  

జీఎస్టీ వల్ల వ్యాపార సంస్థలు తరచూ పన్నుల అధికారులను కలవడం తగ్గిందని అన్నారు. అనేక దేశాలలో జీఎస్టీ రేట్లు 3 నుండి 5 శాతం వరకు ఉంటాయని, భారతదేశంలో ఇవి 5–28 శాతం వరకు ఉన్నాయని కోదండరామ్​ అన్నారు.  జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం పరిమితిని చాలా రాష్ట్రాల్లో మాదిరిగా రూ. 40 లక్షల వార్షిక టర్నోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పెంచాలని ఎఫ్​టీసీసీఐ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.