ఈ కార్డులుంటే పెట్రోల్, డీజిల్ అగ్గువ

ఈ కార్డులుంటే పెట్రోల్, డీజిల్ అగ్గువ

బిజినెస్ డెస్క్, వెలుగు:తరచూ ప్రయాణాలు చేసేవారికి ఫ్యూయల్ క్రెడిట్​కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. చాలా బ్యాంకులు ఆయిల్​ కంపెనీలతో కలిసి ఇట్లాంటి కార్డులను అందిస్తున్నాయి. ఫ్యూయల్ క్రెడిట్ కార్డుల వల్ల  క్యాష్‌‌‌‌బ్యాక్‌‌లు, ఉచిత ఫ్యూయల్, యాక్సిలరేటెడ్ రివార్డ్ పాయింట్లు మొదలైన లాభాలు ఉంటాయి. ఫ్యూయల్ లావాదేవీలపై భారీగా పొదుపు చేయవచ్చు. “సొంత వెహికల్స్​లో ఎక్కువ ప్రయాణించే వారికి ఫ్యూయల్ కార్డ్‌‌లు ప్రయోజనకరంగా ఉంటాయి.  ఎంత ఎక్కువ ఇంధనాన్ని కొనుగోలు చేస్తే అంత ఎక్కువ రివార్డులు & క్యాష్‌‌బ్యాక్‌‌లు వస్తాయి. ఫ్యూయల్ కార్డుల వల్ల వెహికిలిస్టులు కొంత డబ్బును ఆదా చేయవచ్చు”అని ఎక్స్​పర్టులు చెబుతున్నారు.  మరో సంగతి ఏమిటంటే ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్‌‌లు వాడకం 2021లో 10 రెట్లు పెరిగింది.  ఖర్చులను కంట్రోల్ చేయడానికి ఇవి దోహదం చేస్తాయని బ్యాంకులు చెబుతున్నాయి. ముఖ్యమైన ఫ్యూయల్​ కార్డుల గురించి తెలుసుకుందాం.

ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డ్

ఇండియన్ ఆయిల్ సిటీ కార్డు వాడితే వచ్చే టర్బో పాయింట్లతో ఉచితంగా పెట్రోల్,  డీజిల్‌‌‌‌ను సంపాదించవచ్చు. ఈ పాయింట్లకు రెట్లుపైరీ డేట్ ఉండదు. ఎప్పుడైనా వాడుకోవచ్చు.  ఒక టర్బో పాయింట్ రూపాయికి సమానం. అంటే రూపాయి విలువైన ఫ్యూయల్ పోయించుకోవచ్చు.  టర్బో పాయింట్లను హాలీడేస్, ఎయిర్ మైల్స్, క్యాష్‌‌బ్యాక్  వంటివాటికి కూడా రిడీమ్ చేయవచ్చు. అంతేగాక ఇండియన్ ఆయిల్ అవుట్‌‌లెట్లలో ఒక శాతంఫ్యూయల్ సర్‌‌ఛార్జ్‌‌ను మాఫీ చేస్తారు. క్రెడిట్ కార్డ్‌‌పై ఇన్​స్టంట్​ లోన్లు ఇస్తారు.  కార్డ్‌‌పై మొదటి ఖర్చుతో 250 టర్బో పాయింట్లను పొందవచ్చు. వీటిని కార్డ్ జారీ చేసిన 30 రోజులలోపు ఉపయోగించాలి. ఏటా కనీసం రూ.30 వేలు ఖర్చు చేస్తే యాన్యువల్ ఫీజు మాఫీ చేస్తారు. రెస్టారెంట్ల బిల్లులపై 20శాతం వరకు ఆదా చేయవచ్చు. 

కేటగిరీ     ఖర్చు    పాయింట్లు
ఐఓసీ  పంపుల్లో పెట్రోల్/డీజిల్    రూ. 150    4
కిరాణా/సూపర్ మార్కెట్లు     రూ. 150     2
ఇతర ఖర్చులు     రూ. 150     1

ఇండస్‌‌‌‌ఇండ్ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డ్

ఇందులో ఫ్యూయల్ సర్‌‌ఛార్జ్ మాఫీ సౌకర్యం ఉంటుంది. రూ.400– రూ. 4వేలు మధ్య విలువైన అన్నిఫ్యూయల్ లావాదేవీలపై ఒక శాతం సర్‌‌ఛార్జ్ మినహాయింపు వర్తిస్తుంది! ట్రావెల్, లైఫ్​స్టైల్ ఖర్చులపై డిస్కౌంట్లు, పాయింట్లు వస్తాయి. ఇండస్ మూమెంట్స్, ఎయిర్‌‌లైన్ మైల్స్,  క్యాష్ క్రెడిట్ పాయింట్ల ద్వారా అమెజాన్, ఫ్లిప్​కార్ట్​ వంటి గిఫ్ట్ వోచర్లు కొనుక్కోవచ్చు. జాయినింగ్ ఫీజు, యాన్యువల్ ఫీజు లేదు.   కార్డ్ హోల్డర్లకు బుక్‌‌ మై షో నుంచి కొన్ని ఫ్రీ సినిమా టిక్కెట్‌‌లను పొందవచ్చు.  కార్డ్ హోల్డర్లు రూ.25 లక్షల విలువైన వ్యక్తిగత విమాన ప్రమాద కవరేజీని పొందుతారు. 

బీపీసీఎల్ స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్

 స్టేట్ బ్యాంక్,  భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) కలిసి ఈ కో–బ్రాండ్​ను కార్డును లాంచ్ చేసింది.  కిరాణా సామాగ్రి, డిపార్ట్‌‌‌‌మెంటల్ స్టోర్లు, డైనింగ్, ఎంటర్​టైన్​మెంట్ ఖర్చులకు​ దీనిని వాడితే క్యాష్​బ్యాక్​లు, రివార్డు పాయింట్లు వస్తాయి. ప్రతి 4 పాయింట్లు రూపాయికి సమానమని గుర్తుంచుకోవాలి. దేశంలో ఎక్కడైనా బీపీసీఎల్ పెట్రోల్ పంపుల్లో నెలకు రూ.100 వరకు సర్‌‌ఛార్జ్ మాఫీ! బీపీసీఎల్ పెట్రోల్ కొనుగోళ్లపై 4.25శాతం వాల్యూబ్యాక్ వస్తుంది.  రూ. 500 నుండి రూ. 3 వేల మధ్యఫ్యూయల్ లావాదేవీలపై 3.25శాతం వాల్యూబ్యాక్ + 1శాతంఫ్యూయల్ సర్‌‌ఛార్జ్ మినహాయింపు ఉంటుంది. జాయిన్​ బోనస్​గా 2వేల పాయింట్లను పొందవచ్చు. వీటి విలువ రూ.ఐదు వందలు. ఏడాదికి 70 లీటర్ల ఫ్యూయల్ ఆదా అవుతుంది. అయితే ధరలు మారవచ్చునని గుర్తుంచుకోవాలి.బీపీసీఎల్ కార్డ్‌‌ను అంతర్జాతీయంగా 2.4 కోట్లకు పైగా అవుట్‌‌లెట్లలో ఉపయోగించవచ్చు. కార్డు హోల్డర్ కుటుంబ సభ్యుల కోసం యాడ్-ఆన్ కార్డ్‌‌లు అందుబాటులో ఉన్నాయి. ఈఎంఐ, క్రెడిట్ లిమిట్ ట్రాన్స్​ఫర్​ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి.  

కేటగిరీ     ఖర్చు    పాయింట్లు
బీపీసీఎల్ బాంకులు      రూ. 500 ‑ రూ. 3వేలు     13రెట్లు
కిరాణా & సూపర్ మార్కెట్లు    రూ. 100     5రెట్లు
సినిమాలు & డైనింగ్     రూ. 100     5రెట్లు
 రిటైల్ కొనుగోళ్లు     రూ. 100     డబుల్
బిల్స్ , స్టాండింగ్ ఇన్​స్ట్రక్షన్స్​    రూ. 100    5రెట్లు

స్టేట్ బ్యాంక్ సింప్లీ సేవ్ కార్డ్‌‌‌‌ 

మీరు రూ.500‑రూ.మూడు వేల మధ్య ఖర్చు చేసినప్పుడుఫ్యూయల్ సర్‌‌ఛార్జ్‌‌పై ఒక శాతం మాఫీ ఉంటుంది. భారతదేశంలోని ఏ పెట్రోల్ బంకులో ఫ్యూయల్ పోయించుకున్నా సర్​చార్జ్​ మాఫీ చేస్తారు. కార్డ్ సెటప్ చేసిన 60 రోజులలోపు బోనస్ రివార్డ్ పాయింట్లు ఇస్తారు. కార్డ్ జారీ చేసిన మొదటి 60 రోజులలోపు 2000 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే రూ.500 విలువైన రివార్డు పాయింట్లు వస్తాయి. ఏడాదిలో రూ.లక్ష కంటే ఎక్కువ ఖర్చు చేస్తే రెండవ సంవత్సరం నుండి యాన్యువల్ ఫీజు రూ.499 మాఫీ చేస్తారు. 

కేటగిరీ     ఖర్చు    పాయింట్లు
డైనింగ్, సినిమాలు, కిరాణా    రూ. 100     10
ఇతర ఖర్చులు     రూ. 100     1

స్టాండర్డ్ చార్టర్డ్ ప్లాటినం రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ 

ఈ కార్డ్ కాంటాక్ట్‌‌‌‌లెస్ ఫీచర్‌‌తో వస్తుంది.  రివార్డ్స్ క్రెడిట్ కార్డ్‌‌ని ఉపయోగించి షాపింగ్, ప్రయాణం వంటివాటికి ఖర్చు చేస్తే  అనేక రకాల తగ్గింపులు, ఆఫర్లు వరిస్తాయి. మొదటి 90 రోజుల్లో రెస్టారెంట్ల బిల్లుపై రూ.500 వరకు క్యాష్‌‌బ్యాక్ ఇస్తారు. ప్రాసెసింగ్ ఫీజ్ లేకుండా మీ  బకాయి మొత్తాన్ని కిస్తీలుగా మార్చుకోవచ్చు. రూ.60 వేల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే రెన్యువల్ ఫీజ్ మాఫీ చేయస్తారు.  ఈ కార్డ్‌‌తో భారత్ క్యూఆర్, శామ్​సంగ్ పే, భారత్ బిల్ పేమెంట్స్ ఫ్లాట్​ఫారాల ద్వారా డబ్బు చెల్లించవచ్చు.
కేటగిరీ     ఖర్చు    పాయింట్లు
 రెస్టారెంట్లు & ఫ్యూయల్     రూ. 150     5
ఇతర ఖర్చులు     రూ. 150     1

యెస్ బ్యాంక్ ఫిన్‌‌‌‌బూస్టర్ క్రెడిట్ కార్డ్


భారతదేశంలోని ఏ బంకులో ఫ్యూయల్ పోయించుకున్నా ఒక శాతం ఇంధన-సర్‌‌ఛార్జ్ మినహాయింపు (రూ. 400 –- రూ. 5,000 మధ్య లావాదేవీలపై వర్తిస్తుంది)!  50 రోజుల వరకు వడ్డీ రహిత క్రెడిట్ ఇస్తారు.రివార్డ్ పాయింట్ల సంఖ్యపై పరిమితి లేదు. తుది  గడువు తేదీ లేదు. క్రెడిట్‌‌స్ట్రాంగ్ అకౌంట్​కు ఉచిత సభ్యత్వం ఇస్తుంది. ఖర్చులను ట్రాక్ చేయడానికి & క్రెడిట్ స్కోర్‌‌ని చూడటానికి రియల్​టైం డాష్‌‌బోర్డ్‌‌ ఉంటుంది. కార్డులో చేరడానికి ఫీజు లేదు. యాన్యువల్ ఫీజుకూడా  లేదు. ఇది జీవితకాలం ఉచితం.  స్నేహితులను చేర్పిస్తే అదనంగా రివార్డ్ పాయింట్‌‌లను పొందవచ్చు. రివార్డ్ పాయింట్‌‌లను మీ క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడానికి సర్దుబాటు చేయవచ్చు. కార్డుహోల్డర్​కు డెత్ ఇన్సూరెన్స్ కవరేజీ  రూ. 2.5 లక్షలు ఉంటుంది. 

కేటగిరీ     ఖర్చు    పాయింట్లు
ఆన్‌లైన్ డైనింగ్     రూ. 200     10
ఆన్‌లైన్ కిరాణా &  దుస్తులు     రూ. 200     6
ఇతర రిటైల్‌ షాపులు     రూ. 200     2