
భారత వాయుసేన నిర్వహణలోని తేజస్ ఎల్సీఏ (లైట్ కాంబాయ్ ఎయిర్ క్రాఫ్ట్) యుద్ధ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆకాశంలో ఎగురుతున్న తేజస్ యుద్ధ విమానం నుంచి వేరుపడిన ఫ్యూయల్ ట్యాంక్ నేలపై పడింది. ఆ సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
ఇంధన ట్యాంక్ ఊడిపోయిన విషయాన్ని గమనించిన పైలట్ చాకచక్యంగా వ్యవహరించాడు. విషయాన్ని ఎయిర్ బేస్ కు తెలిపి.. జాగ్రత్తగా ల్యాండింగ్ చేశాడు. సూలూరు ఎయిర్ బేస్ కు సమీపంలోని పొలాల్లో పడివున్న ట్యాంక్ ను గుర్తించిన అధికారులు… జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించారు. ఫ్యూయల్ ట్యాంకు పడిన స్థలంలో మూడు అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది.