
‘విక్రమ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్న కమల్ హాసన్ ఆ జోష్‌తో ‘భారతీయుడు 2’ షూటింగ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ గత కొద్దిరోజులుగా రాయలసీమలో జరుగుతోంది. కడప జిల్లా గండికోటలో స్పెషల్‌గా వేసిన సెట్‌లో బ్రిటీష్ కాలం నాటి సీన్స్ తీస్తున్నారు. కూరగాయలు, పశువుల అమ్మకాలు జరుగుతున్న మార్కెట్‌పై బ్రిటీష్ పోలీసులు దాడి చేస్తుంటే, కమల్ హాసన్ వారిని ఎదుర్కొనే సీన్స్ పిక్చరైజ్ చేస్తున్నారు.
ఫిబ్రవరి 4వరకూ ఈ షెడ్యూల్ అక్కడే జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఇక వరుస సమస్యలతో ఆగిపోయిన ఈ చిత్రం.. కిందటేడాది సెప్టెంబర్‌లో తిరిగి షూటింగ్ ప్రారంభమైంది. అది మొదలు వరుస షెడ్యూల్స్‌తో వీలయినంత త్వరగా కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు దర్శకుడు శంకర్. కమల్ హాసన్‌కు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్‌తో కలిసి ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు.