చిన్న నగరాల్లో ఫుల్లు ట్యాలెంట్​

చిన్న నగరాల్లో ఫుల్లు ట్యాలెంట్​

న్యూఢిల్లీ: పెద్ద కంపెనీలన్నీ ఉద్యోగుల కోసం  మెట్రో సిటీలవైపు చూసే పరిస్థితి ఇప్పుడు లేదు.  టైర్–-2 నగరాలు ప్రధాన టాలెంట్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుగా అభివృద్ధి చెందుతున్నాయి.  నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి ఈ నగరాల్లో మెరుగైన అవకాశాలు ఉంటున్నాయి.  చాలా కంపెనీలు టైర్–-2 నగరాలకు విస్తరిస్తున్నాయి. దీంతో రిక్రూటర్లు ఈ ప్రాంతాలకే వస్తున్నారు.  రాండ్​స్టాడ్​ నిర్వహించిన సర్వే ప్రకారం...54 శాతం మంది యజమానులు టైర్–-2,  టైర్–-3 నగరాల నుంచి అభ్యర్థులను నియమించుకోవాలని భావిస్తున్నారు. ఈ నగరాల్లో  ప్రతిభావంతుల సంఖ్య భారీగా ఉంది.  టైర్–-2 నగరాల్లో జైపూర్, వడోదర, ఠాణే, కోయంబత్తూర్,  చండీగఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు  టాప్ 5 టాలెంట్ హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుగా నిలిచాయి.

బ్యాంకింగ్, బీమా, ఆర్థిక పరిశ్రమలు  (బీఎఫ్​ఎస్​ఐ), మానుఫ్యాక్చరింగ్​, ఐటీ,  ఫార్మాస్యూటికల్స్,  హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్ & లైఫ్-సైన్సెస్ (పీహెచ్​ఎల్​) కంపెనీలు ఈ నగరాల వారిని భారీగా నియమించుకుంటున్నాయి. బీఎఫ్​ఎస్​ఐ  విభాగంలో 82.02శాతం నియామకాలు జూనియర్ స్థాయిలో, 9.90 శాతం మధ్య స్థాయిలో,  8.08శాతం సీనియర్ స్థాయిలో ఈ నగరాల నుంచి ఉన్నాయి.  చాలా టైర్–-2 ప్రాంతాల్లో మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు బాగా ఉండటం,  కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం చిన్న నగరాలకు వెళ్లేందుకు ఫ్రెషర్లు సుముఖత చూపడం ఇందుకు కారణాలు. బ్యాంకులు తమ వ్యాపార కార్యకలాపాల అవసరాల కోసం టైర్–-2 నగరాలు నాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్, వడోదర, తిరుచ్చి, కాన్పూర్, లక్నో,  ఇండోర్ నగరాలకు వెళ్తున్నాయి.   కోయంబత్తూర్, నాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్, చండీగఢ్ , కొచ్చి బీఎఫ్​ఎస్​ఐ పరిశ్రమకు భవిష్యత్​లో టాలెంట్ హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుగా  నిలుస్తాయని అంచనా. 

మానుఫ్యాక్చరింగ్​ జాబ్స్​

ఈ సెక్టార్​లో టైర్–-2 నగరాల్లో  78.81శాతం నియామకాలు జూనియర్ లెవెల్​​, 17.8శాతం మధ్య స్థాయిలో,  3.39శాతం సీనియర్ స్థాయిలో ఉన్నాయి. టైర్–-2 నగరాల్లో మానుఫ్యాక్చరింగ్​ కేంద్రాల సంఖ్య వేగంగా పెరుగుతోంది.  కోయంబత్తూరులో జూనియర్ స్థాయిలో  24.68శాతం,  మధ్య స్థాయిలో  31.12శాతం   నియామకాలలో మొదటి స్థానంలో ఉంది.  సీనియర్ స్థాయి నియామకాలలో (20 శాతం) మూడవ స్థానంలో ఉంది.  అద్భుతమైన మౌలిక సదుపాయాలు, ప్రఖ్యాత ఇంజనీరింగ్ సంస్థలు,  నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులతో ఇది బలమైన టైర్– 2 మానుఫ్యాక్చరింగ్​ కేంద్రంగా ఎదిగింది. ఈ నగరంలో ఈవీల తయారీ పెరుగుతున్నందున మరిన్ని అవకాశాలు వస్తాయి. ఠాణే సీనియర్ స్థాయి నియామకాలలో (34.89శాతం) టాప్ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పొందింది.-  జూనియర్ (8.88శాతం)  మిడిల్ (9 శాతం) స్థాయి నియామకాలలో మూడవ స్థానంలో ఉంది. అద్భుతమైన మౌలిక సదుపాయాల వల్ల టైర్–-2 మానుఫ్యాక్చరింగ్​ కేంద్రంగా ఠాణే ర్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  గణనీయంగా పెరిగింది.

టైర్-2 నగరాల్లో ఐటీ ఉద్యోగాలు

ఐటీ కంపెనీలు తమ టాలెంట్ స్ట్రాటజీలో టైర్–-2 స్థానాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ నగరాల నుంచి జూనియర్ స్థాయి ఉద్యోగులను ఎక్కువగా తీసుకుంటున్నాయి. ఈ స్థాయి నియామకాలు టైర్–-2 నగరాల్లోని మొత్తం నియామకాలలో 88.63 శాతం ఉన్నాయి. - రిమోట్ వర్క్ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా కంపెనీలకు కలసి వస్తోంది. దీనివల్ల  ఐటీ ప్రొఫెషనల్స్​ తమ సొంత నగరాల్లోనే ఉంటూ జాబ్​ చేసుకుంటున్నారు. ఫలితంగా టైర్–-2 నగరాల ఆర్థిక వ్యవస్థలు కూడా బలపడుతున్నాయి.  ఈ విభాగంలో తిరువనంతపురం వాటా జూనియర్​ స్థాయి లో 10.43శాతంగా,  మిడిల్  స్థాయిలో 13.54శాతంగా ఉంది. కొచ్చి సీనియర్ స్థాయిలో (18.95శాతం), జూనియర్ స్థాయిలో (9.95శాతం), మధ్య స్థాయిలో 12.18 శాతంతో మూడో స్థానంలో ఉంది. 2021 మార్చి నుంచి కేరళ ఐటీ  ఆదాయంలో 30శాతం పెరుగుదల కనిపించింది.  టెక్నోపార్క్, ఇన్ఫోపార్క్  సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఐటీకి స్థానం కల్పించడం వల్ల అక్కడ ఈ సెక్టార్​ బాగా ఎదుగుతోంది. ఈ మూడు పార్కుల  విస్తరణతో రాబోయే ఐదేళ్లలో దాదాపు 67 వేల అదనపు ఉద్యోగాలు వస్తాయని అంచనా. కోయంబత్తూర్ మధ్య స్థాయి (13.37శాతం)  ,సీనియర్ స్థాయి (12.10శాతం) నియామకాలలో రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ ఐటీ పరిశ్రమ చాలా ఎదిగింది.  అనేక చిన్న  పెద్ద కంపెనీలు  ఆఫీసులను తెరిచాయి.   ఐటీ పార్కులు ఏర్పాటయ్యాయి.  ఆటోమేషన్ టెస్టింగ్, ఎజైల్, ఎస్​ఏపీ, బిజినెస్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల నిపుణులకు ఇక కొదవ లేదు. 

ఫార్మా, హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్, లైఫ్-సైన్సెస్ ఉద్యోగాలు

ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్, లైఫ్-సైన్సెస్ విభాగంలో జూనియర్ స్థాయి (11.05శాతం), మిడిల్ (11.15శాతం),  సీనియర్ (26.60శాతం) స్థాయిలలో ఠాణే మొదటి స్థానానికి చేరుకుంది. మిడిల్ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గోవాకు తొలి ర్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. ఒక ప్రధాన ఫార్మా  హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఠాణే ఎది గింది.   ప్రభుత్వ కార్యక్రమాలు,  నైపుణ్యం కలిగిన నిపుణుల వల్ల ఇది దూసుకెళ్తోంది.  వడోదర జూనియర్ స్థాయి నియామకాలలో రెండవ స్థానంలో (8.77శాతం)  మధ్య స్థాయి నియామకాలలో నాలుగో (9.17శాతం) స్థానంలో ఉంది. ప్రభుత్వ విధానాల కారణంగా అనేక పెద్ద ఫార్మా కంపెనీలు ఇక్కడ కొలువుదీరాయి. బయోటెక్నాలజీ  ఫార్మాస్యూటికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొఫెషనల్స్​సంఖ్య వదోదరలో భారీగా ఉంది.  టైర్-2 నగరాల్లోని మొత్తం నియామకాలలో 85.86శాతం జూనియర్-స్థాయి నియామకాలు ఉన్నాయి.