న్యూఢిల్లీ: వచ్చే ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో అందరూ మహిళలే పార్టిసిపేట్ చేయనున్నారు. ఈమేరకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. పరేడ్‌కు నేతృత్వం, కవాతు, బ్యాండ్ పార్టీ, శకటాల ప్రదర్శన వరకూ అందరూ మహిళలే ఉంటారని తెలిపాయి.
మహిళా సాధికారత, సైన్యంలో మహిళ ల ప్రాతినిధ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో నే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2024 రిపబ్లిక్ డే పరేడ్ ప్లాన్‌పై ఇప్పటికే సంబంధిత మంత్రిత్వ శాఖలకు, ఇతర విభాగాలకూ సమాచా రం అందిందని సమాచారం. దీనిని ఎలా అమలు చేయాలనేదానిపై కసరత్తు చేస్తున్నామని చెప్పాయి.