
- రూ.1.54 కోట్లతో 1786 యూనిట్లు
వనపర్తి, వెలుగు: వ్యవసాయ యాంత్రీకరణ కింద రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందించేందుకు నిధులు మంజూరయ్యాయి. 2025 – 26 సంవత్సరానికి ఖరీఫ్, రబీ సీజన్‌లకు కలిపి వ్యవసాయ యాంత్రీకరణ కింద 1786 యూనిట్లకు రూ. 1.54 కోట్లు కేటాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు వ్యవసాయ రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకుని మరింత పురోభివృద్ధి సాధించేందుకు సబ్సిడీపై యంత్ర పరికరాలను అందిస్తున్నాయి.
కొన్నాళ్లుగా ఆగిపోయిన రాయితీ పథకం తిరిగి ప్రారంభమైంది. ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటా నిధులను కేటాయిస్తున్నాయి. దీంట్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్న కారు రైతులకు 50 శాతం, బీసీ ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీపై యంత్ర పరికరాలను అందించనున్నారు. జిల్లాలో 2.82 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు.
జిల్లాలో 1,96,683 మంది రైతులు ఉన్నారు. స్ర్పేయర్లు, ట్రాక్టర్లతో నడిచే రోటోవేటర్లు, కలుపు తీసే యంత్రాలు, పవర్‌టిల్లర్, పవర్ వీడర్, సీడ్కమ్ఫర్టిలైజర్డ్రిల్తదితర యంత్రాలను అందజేయనున్నారు. అర్హులను జిల్లా, మండల స్థాయి కమిటీలు ఎంపిక చేస్తాయి. ఆసక్తి ఉన్న రైతులు సంబంధిత గ్రామ అగ్రికల్చర్ఎక్స్ టెన్షన్ఆఫీసర్లకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు పట్టాపాస్‌బుక్, ఆధార్‌కార్డ్ జిరాక్సు, బ్యాంకు అకౌంట్తదితర వివరాలను అందించాలి. అర్హులైన రైతులకు అందించే సబ్సిడీ వారి బ్యాంకు అకౌంట్‌లోకి నేరుగా జమ అవుతుంది.
మొదటి విడత రూ.77.13 లక్షలు
వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాకు మొదటి విడతగా రూ. 77.13 లక్షలు కేటాయించారు. రైతుల నుంచి అప్లికేషన్లు తీసుకుని అర్హులైన వారిని గుర్తించి పరికరాలు అందిస్తాం. - ఆంజనేయులుగౌడ్, డీఏఓ, వనపర్తి
వ్యవసాయ పరికరాలు ఇలా
బ్యాటరీ స్ప్రేయర్ 1195
పవర్ స్ప్రేయర్ 323
కల్టివేటర్ 104
రోటోవేటర్ 68
బ్రష్ కట్టర్ 25
సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ 21
స్ర్టా బాలర్స్ 19
పవర్ టిల్లర్ 17
పవర్ వీడర్ 8
బండ్ ఫార్మర్ 6