ఏఎన్ఎమ్ కు ప్రభుత్వ ఖర్చులతో అంత్యక్రియలు

ఏఎన్ఎమ్ కు ప్రభుత్వ ఖర్చులతో అంత్యక్రియలు

నారాయణ పేట జిల్లా మాగనూర్ మండలం వడ్వాట్ గ్రామ స్టేజ్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది.  లారీ ఢీకొని విధి నిర్వహణకు వెళ్తున్న ఏఎన్ఎమ్ వరలక్ష్మి మృతి చెందింది. ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. వరలక్ష్మికి ప్రభుత్వ ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించాలని జిల్లా వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. వరలక్ష్మి మృతి బాధాకరమని.. ఆమె కుటుంబానికి రూ. 50 లక్షల బీమా సొమ్ము ఇవ్వడంతో పాటు వారి కుటుంబంలో అర్హత కలిగిన ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం కల్పిస్తామన్న మంత్రి హరీష్ హామీ ఇచ్చారు. వరలక్ష్మి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరోనా కష్ట కాలంలో వైద్య సిబ్బంది సేవలు వెల కట్టలేనివని మంత్రి అన్నారు.

‘విధినిర్వహణలో మక్తల్ కు చెందిన ఏఎన్ఏం వరలక్ష్మి గారు రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరం. కరోనా విధుల్లో ఉండి మరణించిన వారికి ప్రభుత్వం నుండి అందే 50 లక్షల బీమా సొమ్ము చెల్లించడం జరుగుతుంది. వారి కుటుంబంలో అర్హత కలిగిన ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం కల్పిస్తాం. ప్రభుత్వ ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించాలని  జిల్లా వైద్యాధికారులను ఆదేశించడం జరిగింది. వరలక్ష్మి గారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. వారి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం‌చేస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ‌ సానుభూతి. కరోనా కష్టకాలంలో ప్రజలకు వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి’ అని హరీశ్ ట్వీట్ చేశారు.