బీజేవైఎం తాండూర్ మండల ప్రధాన కార్యదర్శి​పై హత్యాయత్నం

బీజేవైఎం తాండూర్ మండల ప్రధాన కార్యదర్శి​పై హత్యాయత్నం

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి  

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా బీజేవైఎం తాండూర్ మండల ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి భాస్కర్​గౌడ్​పై హత్యాయత్నం చేసిన టీఆర్ఎస్​ గూండాలను అరెస్ట్​ చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్​ జి. వివేక్​వెంకటస్వామి డిమాండ్ చేశారు. నాలుగు రోజులుగా మంచిర్యాల గవర్నమెంట్​హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న భాస్కర్​గౌడ్​ను పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావుతో కలిసి ఆదివారం పరామర్శించారు. భాస్కర్​గౌడ్​ తాండూర్​లో జరిగిన ఓ ఫంక్షన్​కు హాజరై రేచినికి వెళ్తుండగా టీఆర్ఎస్​కు చెందిన ఎనిమిది మంది బైక్​లపై మారణాయుధాలతో వచ్చి దాడి చేశారన్నారు.

సోషల్​మీడియాలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే చంపుతామని బెదిరించారన్నారు. పోలీసులు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్​ చేయాలని డిమాండ్​చేశారు. అలాగే హాజీపూర్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన సునీల్​రావు తల్లి అనారోగ్యంతో ఇటీవల చనిపోవడంతో వారి ఇంటికి వెళ్లి సునీల్​రావును పరామర్శించారు.బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి బొమ్మెన హరీశ్​గౌడ్​, జైపూర్​ మండల అధ్యక్షుడు చల్లా విశ్వంభర్​రెడ్డి, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి డేగ నగేశ్, లీడర్లు జాడి యేసయ్య, పోషన్న, బల్ల వెంకటేశ్, చేగొండ శ్రీనివాస్, మహిపాల్​రెడ్డి, సంతోష్​వర్మ పాల్గొన్నారు.

మత్స్యకారులకు వలలు పంపిణీ
చెన్నూరు నియోజకవర్గంలోని వెలాల గ్రామంలో ఇటీవల వర్షానికి నష్టపోయిన మత్స్య కార్మికులకు వివేక్ ​వెంకటస్వామి వలలు, ఇతర సామగ్రి పంపిణీ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆందుగుల శ్రీనివాస్ , బీజేపీ లీడర్లు పాల్గొన్నారు.