సవాళ్లకు పరిష్కారం చూపుతున్న..భారత్ ​జీ20 ప్రెసిడెన్సీ

సవాళ్లకు పరిష్కారం చూపుతున్న..భారత్ ​జీ20 ప్రెసిడెన్సీ

కరోనా మహమ్మారి అనంతర ప్రపంచ క్రమం దాని ముందు ప్రపంచ పరిస్థితికి చాలా భిన్నంగా ఉన్నది. మూడు ముఖ్యమైన మార్పులు మనకు కనిపిస్తున్నాయి. మొదటిది ప్రపంచ జీడీపీ కేంద్రీకృత దృక్పథం నుంచి మానవ- కేంద్రీకృత దృక్పథానికి మారడం అవసరమనే  అవగాహన, రెండవది ప్రపంచ సప్లయ్ ​చైన్​లో స్థితిస్థాపకత, విశ్వసనీయత ప్రాముఖ్యతను గుర్తించడం, మూడవది ప్రపంచ సంస్థల సంస్కరణల ద్వారా బహుపాక్షికతను పెంచడానికి సమష్టి పిలుపు. ఈ మార్పుల్లో జీ20కి భారత్​అధ్యక్షత వహించడం ఒక ఉత్ప్రేరక పాత్ర పోషించింది.

డిసెంబర్ 2022 ఇండోనేషియా నుంచి జీ 20  ప్రెసిడెన్సీ బాధ్యతలు చేపట్టినప్పుడు, G20 ద్వారా మైండ్​సెట్​మార్పును ఉత్ప్రేరకపరచాలని నేను రాశాను. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఆఫ్రికా లాంటి అట్టడుగు ప్రాంతాల ఆకాంక్షలను ప్రధాన స్రవంతిలో చేర్చే సందర్భంలో ఇది ప్రత్యేకంగా అవసరం.125 దేశాల వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్, మా ప్రెసిడెన్సీలో జరిగిన మొదటి కార్యక్రమాల్లో ఒకటి. గ్లోబల్ సౌత్ నుంచి ప్రతిపాదనలు, ఆలోచనలను సేకరించడానికి ఇది ఒక ముఖ్యమైన అభ్యాసం. 

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు

ఇంటర్ ​కనెక్టెడ్​వరల్డ్​అంటే.. సవాళ్లు కూడా అంతర్గతంగా ఒకదానితో ఒకటి అనుసంధానించబడే ఉంటాయి. ప్రస్తుతం మనం 2030 మిడ్​వేలో ఉన్నాం. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యా(ఎస్​డీజీ)ల విషయంలో పురోగతి ఆశించిన దిశలో సాగడం లేదనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పురోగతిని వేగవంతం చేయడానికి 2023 జీ 20 కార్యాచరణ ప్రణాళిక ఎంతో తోడ్పడుతుంది. జీ 20 సదస్సు ఎస్​డీజీలను అమలు చేయడంలో భవిష్యత్తు దిశను నడిపిస్తుంది. భారతదేశంలో ప్రకృతితో మమేకమై సామరస్యంగా జీవించడం పురాతన కాలం నుంచి వస్తున్న ఒక ఆనవాయితీ.

ఆధునిక కాలంలో కూడా సుస్థిర వాతావరణం కోసం మా వంతు సహకారం అందిస్తున్నాం. గ్లోబల్ సౌత్‌‌‌‌‌‌‌‌లోని అనేక దేశాల అభివృద్ధి వివిధ దశల్లో ఉన్నది. వాతావరణ చర్యల విషయంలో తప్పనిసరిగా పరిపూరకరమైన సాధనగా ఉండాలి. క్లైమేట్ ఫైనాన్స్, సాంకేతికత బదిలీపై చర్యలతో వాతావరణ చర్య కోసం ఆశయాలు సరిపోలాలి.

సహకార విత్తనాలు నాటేందుకు..

భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవడం హఠాత్​పరిణామం లేదా యాక్సిడెంటల్​గా జరిగిందేమీ కాదు. మా సరళమైన, స్కేలబుల్, స్థిరమైన పరిష్కారాలు బలహీనమైన, అట్టడుగు వర్గాలకు మా అభివృద్ధి ఫలాలు చేర్చి వారిని ముందుకు నడిపించడానికి శక్తినిచ్చాయి. అంతరిక్షం నుంచి క్రీడల వరకు, ఆర్థిక వ్యవస్థ నుంచి వ్యవస్థాపకత వరకు భారతీయ మహిళలు వివిధ రంగాల్లో ఇవాళ ముందంజలో ఉన్నారు. వారు స్త్రీల అభివృద్ధి నుంచి స్త్రీ నేతృత్వంలోని అభివృద్ధికి విధానాలను మార్చే స్థాయికి ఎదిగారు. జీ20 ప్రెసిడెన్సీ లింగ అసమానతలను, విభజనను తగ్గించి, శ్రామిక శక్తి భాగస్వామ్య అంతరాలను తొలగించి, నాయకత్వం, నిర్ణయాధికారంలో మహిళలకు పెద్ద పాత్రను అందించడంపై పని చేస్తోంది. భారతదేశానికి జీ20 అధ్యక్ష బాధ్యతలు కేవలం ఉన్నత స్థాయి దౌత్య ప్రయత్నం మాత్రమే కాదు. ప్రజాస్వామ్యానికి తల్లిగా, వైవిధ్యానికి నమూనాగా, మేము ప్రపంచానికి తలుపులు తెరిచాం.

మాకు జీ 20 ప్రెసిడెన్సీ మినహాయింపు కాదు. ఇది ప్రజల ఆధారిత ఉద్యమంగా మారింది.125 దేశాల నుంచి దాదాపు 100,000 మంది ప్రతినిధులకు భారత్​ఆతిథ్యం ఇచ్చింది. 60 భారతీయ నగరాల్లో 200కి పైగా సమావేశాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇంత విశాలమైన, వైవిధ్యమైన భౌగోళిక విస్తీర్ణాన్ని ఏ ప్రెసిడెన్సీ చుట్టుముట్టలేదు. భారతదేశ జనాభా, ప్రజాస్వామ్యం, వైవిధ్యం, అభివృద్ధి గురించి మరొకరి నుంచి వినడం కంటే.. వాటిని ప్రత్యక్షంగా అనుభవించడం పూర్తి భిన్నంగా ఉంటుంది. జీ20 ప్రతినిధులు దీనికి హామీ ఇస్తారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. విభజనలను అధిగమించడానికి, అడ్డంకులను కూల్చివేయడానికి, అసమ్మతిపై ఐక్యత ఉన్న ప్రపంచాన్ని పోషించే సహకార విత్తనాలను నాటడానికి మా జీ20 ప్రెసిడెన్సీ కృషి చేస్తుంది. జీ 20 ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా ప్రతి స్వరం వినిపించేలా, ప్రతి దేశం దోహదపడేలా గ్లోబల్ టేబుల్‌‌‌‌‌‌‌‌ను విస్తరిస్తామని మేము ప్రతిజ్ఞ చేశాం. చర్యలు, ఫలితాలతో మేము మా ప్రతిజ్ఞను సరిపోల్చామని నేను
భావిస్తున్నాను.

వాతావరణ మార్పులు

వాతావరణ మార్పులపై ‘మనం ఏమి చేయలేం.. చేయకూడద’నే పూర్తి నిర్బంధ వైఖరి నుంచి వైదొలగాల్సిన అవసరం ఉందని మేము విశ్వసిస్తున్నాం. వాతావరణ మార్పులతో పోరాడటానికి ఏం చేయొచ్చనే దానిపై మరింత నిర్మాణాత్మక వైఖరిపై మేము దృష్టి సారిస్తున్నాం. స్థిరమైన, స్థితిస్థాపకమైన బ్లూ ఎకానమీ కోసం చెన్నై హెచ్ఎల్​పీలు మన మహాసముద్రాలను ఆరోగ్యంగా ఉంచుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ ఇన్నోవేషన్ సెంటర్‌‌‌‌‌‌‌‌తో పాటు క్లీన్ అండ్​గ్రీన్ హైడ్రోజన్ కోసం గ్లోబల్ ఎకోసిస్టమ్ మా ప్రెసిడెన్సీ నుంచి ఉద్భవిస్తున్నదే. 2015లో మేము అంతర్జాతీయ సౌర కూటమిని ప్రారంభించాం. ఇప్పుడు గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ ద్వారా, సర్క్యులర్​ ఎకానమీ ప్రయోజనాలకు అనుగుణంగా శక్తి పరివర్తనలను ప్రారంభించడానికి మేము ప్రపంచానికి మద్దతు ఇస్తాం.

ఉద్యమానికి ఊపునివ్వడానికి వాతావరణ చర్యను ప్రజాస్వామీకరించడం ఉత్తమ మార్గం. వ్యక్తులు వారి దీర్ఘకాలిక ఆరోగ్యం ఆధారంగా రోజువారీ నిర్ణయాలు తీసుకున్నట్లే, గ్రహాల(భూమి) దీర్ఘకాలిక ఆరోగ్యంపై ప్రభావం ఆధారంగా జీవనశైలి నిర్ణయాలు తీసుకోవచ్చు. యోగ క్షేమం కోసం గ్లోబల్ మాస్ మూవ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌గా మారినట్లే, మేము కూడా సస్టైనబుల్ ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం జీవనశైలి (లైఫ్)తో ప్రపంచాన్ని కదిలించాం.

డిజిటల్ పబ్లిక్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్

వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా, ఆహారం, పోషకాహార భద్రతను నిర్ధారించడం చాలా కీలకం. మిల్లెట్స్, లేదా శ్రీ అన్న లాంటి విధానాలు క్లైమేట్ -స్మార్ట్ అగ్రికల్చర్​ను బలోపేతం చేయడంలో కూడా సహాయపడతాయి. అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం సందర్భంగా మేము మిల్లెట్లను గ్లోబల్ ప్యాలెట్‌‌‌‌‌‌‌‌లకు తీసుకువెళ్లాం. ఆహార భద్రత, పోషకాహారంపై దక్కన్ ఉన్నత స్థాయి సూత్రాలు కూడా ఈ దిశలో సహాయపడతాయి. టెక్నాలజీ ఎప్పుడూ మారుతూ ఉంటుంది. కానీ దాన్ని కూడా కలుపుకొని పోవాలి. గతంలో, సాంకేతిక పురోగతి ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలు సమానంగా పొందలేదు. భారతదేశం, గత కొన్నేండ్లుగా, సాంకేతికతను సంకుచిత అసమానతలను విస్తృతం చేయకుండా వాటిని ఎలా ఉపయోగించవచ్చో చూపించింది.

ఉదాహరణకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియన్ల కొద్దీ బ్యాంకింగ్ లేదా డిజిటల్ గుర్తింపులు లేని వాటిని డిజిటల్ పబ్లిక్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్(డీపీఐ) ద్వారా ఆర్థికంగా చేర్చవచ్చు. మా డీపీఐని ఉపయోగించి మేము రూపొందించిన పరిష్కారాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇప్పుడు జీ20 ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలు సమగ్ర వృద్ధి శక్తిని అన్​లాక్ చేయడానికి డీజీఐని స్వీకరించడానికి, నిర్మించడానికి మేము సహాయం చేసే స్థాయిలో ఉన్నాం.

‘వసుదైవ కుటుంబం’ ఈ రెండు పదాల్లో లోతైన తాత్వికత ఉన్నది. ప్రపంచం అంతా ఒకే కుటుంబం అనేది దీని అర్థం. సరిహద్దులు, భాషలు, భావజాలాలకు అతీతంగా ఒకే సార్వత్రిక కుటుంబంగా పురోగమించేలా మనల్ని ప్రోత్సహిస్తున్న అందరినీ అక్కున చేర్చుకునే అద్భుత దృక్పథం ఇది. జీ 20 శిఖరాగ్ర సదస్సుకు భారతదేశం అధ్యక్షత వహిస్తున్న ఈ సమయంలో ‘వసుదైవ కుటుంబం’ను మానవ -కేంద్రీకృత పురోగతికి ఒక పిలుపుగా మార్చాం.

ఒకే భూమి.. మనం జీవనం సాగించడానికి ఉన్న భూగ్రహాన్ని కాపాడుకుంటూ, ఒకే కుటుంబం.. వృద్ధి సాధనలో ఒక దేశం మరొక దేశంతో తోడ్పాటు, మద్దతు అందించుకుంటూ, ఒకే భవిష్యత్.. పరస్పర భాగస్వామ్యంతో ముందుకు వెళ్లేలా భారత్​జీ 20 సమావేశాలను ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్’ నినాదంతో నిర్వహిస్తున్నది. 

- నరేంద్ర మోదీ,
భారత ప్రధాని