జీ 20 సమ్మిట్.. నేమ్ ప్లేట్ పై ఇండియా ప్లేస్ లో భారత్

జీ 20 సమ్మిట్.. నేమ్ ప్లేట్ పై ఇండియా ప్లేస్ లో భారత్

దేశంలో కొన్ని రోజులుగా ఇండియా పేరును భారత్ గా మార్చాలన్న దానిపై తీవ్ర చర్చ సాగుతుండగా.. ఈ రోజు మరోసారి కేంద్రం తన వాదనను నొక్కి చెప్పింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు దేశ రాజధానిలో G20 సమ్మిట్ 2023 మొదటి సెషన్‌లో ప్రసంగించారు. ఈ క్రమంలో సమావేశ వేదిక వద్ద, ప్రధాని మోదీ ముందు ఉన్న డిస్‌ప్లే కార్డ్‌పై ' భారత్' అని రాసి ఉండడం గమనార్హం.

రెండు రోజుల పాటు జరిగే ఈ జీ 20 సమావేశం ప్రారంభంలో ప్రసంగించిన మోదీ.. ఈ సమ్మిట్‌కు 'భారత్'కు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడిగా మోదీ గుర్తించబడ్డారు. ప్రభుత్వం అనేక అధికారిక G20 పత్రాలలో భారతదేశంతో పాటు దేశానికి రాజ్యాంగంలో ఉపయోగించిన పేరు 'భారత్'ను ఉపయోగించింది. ఇది ఒక అవగాహనతో తీసుకున్న నిర్ణయమని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో సమ్మిట్ వేదికైన భారత్ మండపంలో మోదీ ప్రసంగిస్తున్నప్పుడు ఆయన ముందు ఉన్న నేమ్ కార్డ్ పై 'భారత్' అని రాసి ఉంది.

Also Read :- జీ20 విందుకు కేసీఆర్కు ఆహ్వానం ..వెళ్తారా.. డుమ్మా కొడతారా..

 "మేము G20 కార్యకలాపాలను ప్రారంభించే ముందు, మొరాకోలో భూకంపం కారణంగా ప్రాణనష్టం జరిగినందుకు నేను నా సంతాపాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. ఈ క్లిష్ట సమయంలో మొరాకోకు సాధ్యమైన సహాయం అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉంది"అని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచానికి కొత్త దిశను చూపించడానికి 21వ శతాబ్దం ఒక ముఖ్యమైన సమయం అని ప్రధాని మోదీ అన్నారు. మానవ కేంద్రీకృత దృక్పథంతో మన బాధ్యతలను నిర్వర్తిస్తూ ముందుకు సాగాలని, మనం COVID-19ని ఓడించగలిగినట్టే, యుద్ధం వల్ల ఏర్పడిన విశ్వాస లోటుపై కూడా విజయం సాధించగలం" అని ఆయన చెప్పారు.

ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముని "భారత్ ప్రెసిడెంట్" అని సూచిస్తూ G20 విందు ఆహ్వానంపై సెప్టెంబర్ 5న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వంపై కాంగ్రెస్ దాడి చేసిన తర్వాత.. 'ఇండియా వర్సెస్ భారత్' వివాదం మధ్య ఈ చర్య మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ చర్యతో ప్రభుత్వం భయపడుతోందని ప్రతిపక్షం ఆరోపించింది.