
ఫేసియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్(ఎఫ్ఆర్ఎస్)ను ఉపయోగించి ఎంత మందిలో ఉన్నా అనుమానితుడిని ఇట్టే గుర్తు పట్టే కెమెరాలను ఏర్పాటు చేశారు. దీనికోసం స్పెషల్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ తయారు చేశారు. ఇందులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, టెర్రరిస్టులు, ఖలిస్తానీ వేర్పాటు వాదుల ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేశారు. మొత్తం 3లక్షల మంది అనుమానితుల డేటా ఇందులో ఉంటుంది.
ఎఫ్‌ఆర్‌ఎస్‌తో కూడిన కెమెరా ప్రతి ఒక్కరి ఫేస్‌ను స్కాన్ చేస్తుంది. రెండు కండ్లు, చిన్, ఫోర్ హెడ్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఆధారంగా సస్పెక్ట్‌ను గుర్తించేలా తీర్చిదిద్దారు.
అప్లోడ్ అయిన వీడియోలు, ఫొటోల్లో ఉన్న వ్యక్తి సమిట్ ఏరి యాలో కనిపిస్తే కెమెరాకు దగ్గరలో ఉన్న పోలీసులకు అలర్ట్ వెళ్తుంది. డేటాబేస్‌లో ఉన్న అనుమానితుడిని 95% వరకు ఐడెంటిఫై చేయగలదు. సెంట్రల్ ఢిల్లీలో ఉన్న కెమెరాల ఫీడ్‌ను కూడా పోలీసులు సీ4ఐ కమాండ్ రూమ్‌కు కనెక్ట్ చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ప్రోగ్రామ్, ఎఫ్ఆర్ఎస్ ఆధారంగా ఈ కెమెరాలను ఉపయోగిస్తారు.