Gabrine Muguruza: 30 ఏళ్లకే రిటైర్మెంట్: టెన్నిస్‌కు స్పెయిన్ సుందరి గుడ్ బై

Gabrine Muguruza: 30 ఏళ్లకే రిటైర్మెంట్: టెన్నిస్‌కు స్పెయిన్ సుందరి గుడ్ బై

స్పానిష్ టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి, మాజీ ఉమెన్స్ వరల్డ్ నం.1 గాబ్రిన్ ముగురుజా తన టెన్నిస్ ప్రొఫెషనల్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. శనివారం(ఏప్రిల్ 20) తాను టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు అధికారికంగా తెలియజేసింది. 2023 జనవరి  నుంచి ముగురుజా టెన్నిస్ కు దూరంగా ఉంటుంది. వరుసగా నాలుగు మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత టెన్నిస్ నుంచి తాత్కాలికంగా బ్రేక్ తీసుకుంది. అయితే తాజాగా తాను టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. 

30 ఏళ్ల ఈ స్పెయిన్ సుందరి లారస్ అవార్డుల వేడుకలో విలేకరుల సమావేశంలో టెన్నిస్ కు వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైందని 13 ఏళ్ళ తన ప్రయాణం ఎంతో గొప్పగా సాగిందని ఆమె అన్నారు. లియోన్ ఓపెన్‌లో గాబ్రిన్ ముగురుజా చివరిసారిగా కోర్టులో కనిపించింది. ఈ మ్యాచ్ లో మొదటి రౌండ్‌లోనే లిండా నోస్కోవా చేతిలో ఓడిపోయింది.

ముగురుజా తన 17 సంవత్సరాల వయస్సులో మియామి ఓపెన్‌లో టెన్నిస్ అరంగేట్రం చేసింది. మొత్తం 686 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 449 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఫ్రెంచ్ ఓపెన్ (2016), వింబుల్డన్ (2017) గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ తో పాటు  2021లో WTA టూర్ ఫైనల్స్ టైటిల్‌ గెలుచుకుంది. 2015 లో వింబుల్డన్ ఫైనల్ కు వచ్చినా.. సెరెనా విలియమ్స్ చేతిలో ఓడిపోయింది.    ఓవరాల్ గా 10 టైటిళ్లతో తన కెరీర్‌ను ముగించింది.