
ఇంద్రజ, అజయ్, జయసుధ, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సీఎం పెళ్లాం’.గడ్డం రమణా రెడ్డి దర్శకత్వంలో బొల్లా రామకృష్ణ నిర్మించారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం మే 9న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అజయ్ మాట్లాడుతూ ‘ఉమెన్ ఎంపవర్‌మెంట్ కంటెంట్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. పొలిటికల్‌గా ఏమేం మార్పులు చేస్తే బాగుంటుందో ఇందులో చూపించారు. జయసుధ గారు, సుమన్ గారు, ఇంద్రజ గారిలాంటి సీనియర్స్‌తో నటించడం ఆనందంగా ఉంది. మంచి మెసేజ్ ఇచ్చే ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా’ అని అన్నాడు.
దర్శకుడు రమణా రెడ్డి మాట్లాడుతూ ‘పొలిటికల్ లీడర్ ఇచ్చిన హామీలను, సామాన్యుల సమస్యలను ఆయన భార్య నెరవేరిస్తే ఎలా ఉంటుందని ఇందులో చూపించాం. ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో వైరస్ వ్యాధి కన్నా మించింది బుూతు. మీడియా ముందుకు వచ్చి రాజకీయ నాయకులు బుూతులు మాట్లాడకూడదన్న పాయింట్‌ను ఈ సినిమా ద్వారా బయటపెడుతున్నా.
►ALSO READ | KetikaSharma: అల్లు అర్జున్తో ఎలాంటి సీన్లైనా రెడీ..
రాజకీయ నాయకులు మీడియా ముందుకొచ్చి బూతులు మాట్లాడితే ఎన్నికల్లో ఐదేళ్ల పాటు పోటీ చేయకుండా నిషేధం విధించాలనే రూల్ తీసుకురావాలని ఈ సినిమాలో చూపించబోతున్నాం. అలాగే పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే.. పవర్ కోల్పోతారన్న రూల్ కూడా రావాలి. కాబట్టి ఇది రొటీన్ సినిమా కాదు. ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్‌లో ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాం..’అని చెప్పాడు.
పొలిటికల్ లీడర్స్, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వచ్చి ప్రజలకు సేవ చేస్తే ఎలా ఉంటుందని ఈ చిత్రంలో చూపించబోతున్నట్టు నిర్మాత రామకృష్ణ చెప్పారు. నటుడు శ్రీనివాస్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.