KetikaSharma: అల్లు అర్జున్తో ఎలాంటి సీన్లైనా రెడీ.. జానర్తో కూడా సంబంధంలే.. కేతికా శర్మ కామెంట్స్

KetikaSharma: అల్లు అర్జున్తో ఎలాంటి సీన్లైనా రెడీ.. జానర్తో కూడా సంబంధంలే.. కేతికా శర్మ కామెంట్స్

గ్లామర్ హీరోయిన్‌‌‌‌గా యూత్ ఆడియెన్స్‌‌‌‌ను ఆకట్టుకున్న కేతిక శర్మ.. నటిగా విభిన్న పాత్రలు చేయాలనే కోరిక ఉందని చెప్పింది.  శ్రీవిష్ణు హీరోగా కార్తీక్ రాజు రూపొందించిన ‘సింగిల్’ చిత్రంలో ఈమె హీరోయిన్‌‌‌‌గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి కలిసి నిర్మించిన ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా కేతిక శర్మ చెప్పిన విశేషాలు.

‘‘పర్ఫెక్ట్  స్టార్ కాస్ట్‌‌‌‌తో వస్తోన్న వెరీగుడ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ ఇది.  కథ విన్నప్పుడే చాలా ఎంజాయ్ చేశా. ఇందులో పూర్వా అనే  పాత్రలో ఇండిపెండెంట్, ప్రాక్టికల్ గర్ల్‌‌‌‌గా కనిపిస్తా. కథలో ఎమోషన్ నా క్యారెక్టర్ ద్వారానే వస్తుంది. కొన్ని సీరియస్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ  అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా అందర్నీ అలరిస్తుంది.

ఇందులో లవ్ స్టోరీ కూడా చాలా ఇంటరెస్టింగ్‌‌‌‌గా ఉంటుంది. నా క్యారెక్టర్ రిలేటబుల్‌‌‌‌గా ఉంటుంది.  శ్రీవిష్ణుతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్. ఆయన కామెడీ టైమింగ్ చాలా యూనిక్‌‌‌‌గా ఉంటుంది. స్పాట్‌‌‌‌లో డైలాగ్స్ ఇంప్రవైజ్ చేసేస్తుంటారు. ఆయన  టైమింగ్ మ్యాచ్ చేయడం వెరీ డిఫికల్ట్. ఇక  ఈ చిత్రంలో మరో హీరోయిన్‌‌‌‌గా నటించిన ఇవానా బ్యూటిఫుల్ గర్ల్. ఆన్ స్క్రీన్‌‌‌‌లో మా మధ్య ఒకటి రెండు సీన్స్ మాత్రమే  ఉన్నాయి.

అయితే ఆఫ్ స్క్రీన్‌‌‌‌లో మేము చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాం. డైరెక్టర్ కార్తీక్ రాజుకు చాలా క్లియర్ విజన్ ఉంది. ఈ సినిమాని హైలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌ మూవీగా తీర్చిదిద్దారు. సమ్మర్ రొమాంటిక్ కామెడీ ఆఫ్ ద ఇయర్‌‌‌‌‌‌‌‌గా ఈ సినిమా ప్రేక్షకులకి కావలసిన నవ్వులు పంచుతుంది. నా కెరీర్ పట్ల  చాలా ఆనందంగా ఉన్నాను . గెలుపోటములు మన చేతిలో ఉండవు.

వర్క్ చేయడం ఒక్కటే మన చేతిలో ఉంటుంది. రిజల్ట్స్ గురించి ఆలోచించకుండా నేనెప్పుడూ కెరీర్‌‌‌‌‌‌‌‌ని సెలబ్రేట్ చేసుకోవాలనే చూస్తుంటాను. నిజంగా ఒక నటిగా కొనసాగడం అదృష్టంగా భావిస్తాను. ప్రస్తుతం  హిందీలో ఒక సినిమా చేస్తున్నా. అలాగే తెలుగు, తమిళ  బైలింగ్వల్ ఒకటి చేస్తున్నా. ఇంకొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. త్వరలోనే మేకర్స్ అనౌన్స్‌‌‌‌ చేస్తారు’’అని కేతిక శర్మ చెప్పుకొచ్చింది. 

►ALSO READ | Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ షూట్ కంప్లీట్.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!

అలాగే అల్లు అర్జున్ తో నటించాలని ఉందని తన మనస్సుల్లోని మాటను బయటపెట్టింది. అల్లు అర్జున్ సరసన ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి రెడీ. జానర్ తో కూడా సంబంధం లేకుండా నటించేందుకు తాను సిద్ధమేనని ఓపెన్ కామెంట్స్ చేయడం ఇపుడు ఆసక్తికరంగా మారింది.  

అయితే, ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీతో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఆ సినిమా కోసం హీరోయిన్ల వేట కొనసాగుతుంది. ఇప్పటికే, మృణాల్ ఠాకూర్ ను అట్లీ కన్ఫామ్ చేశారు. ఇక దీపికా పదుకొణె, జాన్వీ కపూర్ వంటి హీరోయిన్లతో కూడా చర్చలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే కేతికా శర్మ తన మనసులో మాట చెప్పడం ఆసక్తిగా మారింది. అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్ లో మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఉందతని టాక్. మరి కేతికా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ అందుకుంటుందా..లేదా అనేది చూడాలి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ketika (@ketikasharma)