Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ షూట్ కంప్లీట్.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ షూట్ కంప్లీట్.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు’. దర్శకుడు  క్రిష్ కొంత భాగాన్ని తెరకెక్కించగా,  జ్యోతి కృష్ణ బ్యాలెన్స్‌‌‌‌ షూట్‌‌‌‌ను చిత్రీకరిస్తున్నాడు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌‌‌‌ను ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో తెరకెక్కిస్తున్నారు.

లేటెస్ట్గా ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. వరుసగా మూడు రోజులు షూటింగ్‌‌‌‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తన పోర్షన్‌‌‌‌ షూటింగ్‌‌‌‌ను మంగళవారంతో (మే6) కంప్లీట్ చేశారని Xలో పోస్టర్ రిలీజ్ చేశారు. త్వరలోనే బిగ్ స్క్రీన్ కు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలియజేశారు. ఇందుకు వీరమల్లు టీమ్‌‌‌‌తో పవన్ కలిసున్న ఫొటోను షేర్ చేస్తూ..అతి త్వరలోనే మాసివ్ ట్రైలర్, బ్లాక్ బస్టర్ సాంగ్స్‌‌‌‌ కూడా రాబోతున్నాయని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

అయితే, ఈ మూవీ పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. మే 9న విడుదల కావల్సి ఉండగా మరోసారి వాయిదా పడింది. ఈ నెలాఖరులో లేదా జూన్ రెండో వారంలో రిలీజ్‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

Also Read : నేను పాల్గొంటే చరిత్ర అవుతుందని తెలియదు

ఈ క్రమంలో మే 30న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినా..  ఆ డేట్ కూడా వర్కవుట్ కాలేదు. లేటెస్ట్ గా మరోకొత్త డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకు జూన్ 12 అయితే, సేఫ్ డేట్ అని మేకర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 

ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్‌‌‌‌గా నటించగా బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ దయాకర్ రావు నిర్మిస్తున్నారు.